Weight Loss Tips : ఈ సమ్మర్‌లో బరువు తగ్గడానికి దోసకాయల్లో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే?

Weight Loss Tips : దోసకాయలో బరువు తగ్గే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ప్రతిఒక్కరూ తమ ఆహారంలో దోసకాయలను తప్పనిసరిగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Weight Loss Tips : ఈ సమ్మర్‌లో బరువు తగ్గడానికి దోసకాయల్లో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే?

How Cucumbers Can Help You Lose Weight This Summer

Weight Loss Tips : వేసవి కాలం వచ్చిందంటే చాలా మంది బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. వేసవిలో శరీరంలో వేడితో పాటు కొవ్వును తగ్గించుకోవడానికి ఇదే సరైన సమయం. బరువు తగ్గడానికి.. మీరు తక్కువ కేలరీలు తీసుకోవాలి. తీసుకున్న కేలరీలను ఎక్కువ బర్న్ చేయాలి.

బరువు తగ్గడంలో సహాయపడే అనేక ఆహారాలు ఉన్నాయి. బరువు తగ్గడానికి సాయపడే వేసవి కూరగాయలలో ఒకటి కీరదోసకాయ ఒకటి. దోసకాయలతో మంచి పోషణను అందిస్తాయి. బరువు తగ్గడానికి దోసకాయలు ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Garlic Health Benefits : వెల్లుల్లి తింటే కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలివే.. మీ డైట్‌లో తప్పక చేర్చుకోండి!

దోసకాయలతో బరువు ఎలా తగ్గవచ్చుంటే? :
1. కేలరీలు తక్కువగా ఉంటాయి :
దోసకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఒక కప్పు దోసకాయలో దాదాపు 16 కేలరీలు ఉంటాయి. వేసవిలో కీరదోసకాయను స్నాక్‌గా తీసుకోవచ్చు.

2. అధిక నీటి శాతం :
దోసకాయలు ఎక్కువగా నీటిని కలిగి ఉంటాయి. అధిక నీటి కంటెంట్ బరువు తగ్గడానికి కూడా సాయపడుతుంది. మీ ఆహారంలో ఎక్కువ కేలరీలు లేకుండా ఆకలి తగ్గేందుకు సాయపడుతుంది.

3. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది :
ఫైబర్ ఎక్కువసేపు నిండుగా ఉంచడం ద్వారా బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. అదనపు కేలరీలను తీసుకోకుండా నిరోధిస్తుంది. దోసకాయలలోని ఫైబర్ కంటెంట్ బరువు తగ్గడానికి కూడా సాయపడుతుంది.

దోసకాయలతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలివే :
విటమిన్ సి, విటమిన్ కె, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్ వంటి అనేక రకాల పోషకాలను అందించడంలో దోసకాయలు అద్భుతంగా సాయపడతాయి. దోసకాయలలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని నిరోధించడంలో సాయపడతాయి. వేసవిలో డీహైడ్రేషన్‌ను నివారించడంలో సహాయపడతాయి. దోసకాయలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సాయపడతాయి. దోసకాయలు తినడం వల్ల మంట తగ్గుతుంది.

Read Also : World Health Day : మీకు ప్రీ-డయాబెటిస్‌ ఉందని తెలుసా? కంట్రోల్ చేయకుండా వదిలేయవద్దు.. వైద్యుల హెచ్చరిక..!