my Partner's
Relationships: ఎదుటివారి తప్పులను ఎత్తి చూపి మాట్లాడటం సులువే. కానీ అలా చేయడం ఎంత బాధపెడుతుందో ఊహించలేం. నిజానికి ఆలుమగల మధ్య అలకలు, ఘర్షణలు అందరికీ ఉండేవే. ఒకరి తప్పును ఇంకొకరు ఎత్తి చూపడం, దెప్పిపొడుచుకోవడం కామనే. అలా చేయలేదా.. ఇలా చేయలేదా అంటూ చేసే కంప్లైంట్లు మామూలే. అలాంటివన్నీ అప్పటికప్పుడు ముగిసిపోవాలి. అలా కాకుండా ఫిర్యాదుల చిట్టా పెరిగిందంటే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదముంటుంది. ఎందుకంటే నిందించే వారికి అది బాగానే ఉన్నప్పటికీ.. ఎదుటివారిని చాలా బాధపెడుతుంది.
గొడవైన ప్రతిసారి అనుకుంటాం ఇంకోసారి కంప్లైంట్ చేయడం మానుకోవాలి అని. కానీ ఏం చేస్తాం.. యథావిధిగా అదే పని చేస్తుంటాం. కాబట్టి మీ భాగస్వామి విషయంలో ఫిర్యాదులు చేయకుండా.. వైవాహిక జీవితం సంతోషంగా గడపటానికి కొన్ని చిన్ని చిట్కాలు ట్రై చేద్దాం…
ఆలోచన ఆపేయండి
ఇది చాలా మంది థెరపిస్ట్‌లు చెబుతున్న సలహా. ఎప్పుడైతే మన మైండ్‌లో నెగిటివ్ థాట్ వస్తుందో.. అప్పుడు వెంటనే స్టాప్ సింబల్‌ను గుర్తుచేసుకోవాలట. ఆ విషయాన్ని ఆపేసి వేరే ఏదైనా మంచి విషయాన్ని గుర్తుచేసుకోవాలట.
రాసి పెట్టుకోండి
ఫిర్యాదులు మొహం మీద చెప్పి గొడవలు పెంచుకోవడం కన్నా.. వాటిని ఏదైనా డైరీలో లేదా పుస్తకంలో రాసి పెట్టుకోవడం మంచిదట. అంతేకాదు.. వాటిని ఎలా పరిష్కరించాలో కూడా రాసుకోవడం వల్ల ప్రశాంతంగా ఉంటుందని నిపుణుల సలహా.
నవ్వి ఊరుకోండి
మీకు ఏదైనా విషయంలో మీ భాగస్వామిపై ఫిర్యాదు చేయాలని అనిపిస్తే.. ఆ సమయంలో కాసేపు నవ్వి ఊరుకోండి. లేదా వారితో ఓసారి ఈ విషయమై మాట్లాడండి.. ఫిర్యాదు చేసినట్టు కాకుండా కాస్త ప్రేమగా వారిని నొప్పించకుండా వారి పొరబాటును చెప్పండి.
*మీ భాగస్వామిలో మీకు నచ్చిన విషయాలను గుర్తుచేసుకోండి
*పరిస్థితిని మార్చేందుకు ప్రయత్నించండి
* మీలోని నెగిటివ్ ఆలోచనలను ఆశావాదంగా మార్చుకోండి.
*మీ సమస్య/ఫిర్యాదు స్నేహితులకు చెప్పి వారేం సలహా ఇస్తారో తెలుసుకోండి.