Instant Covid Test : కాఫీతో కోవిడ్‌ టెస్ట్‌ చేయొచ్చు… ఇదిగో ప్రాసెస్..!

Coronavirus: Sniffing coffee could predict COVID-19 Test Instantly

Coffee COVID-19 Diagnostic Tool : కరోనా వచ్చిందోమనని భయంగా ఉందా? చూస్తుంటే లక్షణాలు అలాగే కనిపిస్తున్నాయా? అయితే కంగారు పడకండి.. కరోనా టెస్టు కోసం ఎక్కడికో  పరుగులు పెట్టాల్సిన పనిలేదు. ఉన్నచోటే.. ఇంటి దగ్గరే కరోనా టెస్టు చేయించుకోవచ్చు. అది కూడా మీరు తాగే కాఫీతోనే.. అది ఎలానంటారా? కాఫీ తాగే అలవాటు ఉన్నవారిలో కరోనాను ముందుగానే పసిగట్టేస్తారని కొన్ని అధ్యయనాల్లో తేలింది.

కరోనా వైరస్‌ సోకినవారిలో సాధారణంగా రుచి తెలియకపోవడం వాసన కోల్పోవడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. కరోనా ప్రధాన లక్షణాలను బట్టి వారికి వైరస్ సోకి ఉండొచ్చునని నిర్ధారణకు రావొచ్చు. కొంతమందిలో వైరస్ సోకినట్టు అయితే వారిలో వాసన పసిగట్టే గుణాన్ని కోల్పోతారు. ఇంతకీ కరోనాకు కాఫీకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? కాఫీ స్మెల్ చేయగలరు కదా.. అలాగే రుచిని కూడా ఆశ్వాదించగలరు..

ఈ టెక్నిక్ ద్వారా కాఫీ వాసనను పసిగట్టడం ద్వారా మీకు కరోనా సోకిందో లేదో ఇట్టే తెలుసుకోవచ్చు. కరోనా వైరస్ సోకిన వ్యక్తులు కాఫీ తాగినట్టయితే వారు ముక్కుతో వాసనను గుర్తించలేరు. రుచిని కూడా ఆశ్వాధించలేరు. గాఢమైన వాసన కలిగిన కాఫీ పరిమాళాన్ని కూడా పసిగట్టేలేకపోతున్నారంటే.. లక్షణాలను బట్టి వారికి కరోనా సోకినట్టు అనుమానించాల్సిందే..

ఇటీవల కోవిడ్‌ను పసిగట్టేందుకు చాలామంది పరిశోధకులు కాఫీనే అధికంగా వినియోగిస్తున్నారని కొన్ని నివేదికల్లో తేలింది. వాసన తెలియని వారికి టెస్టులు చేయిస్తే వారిలో కరోనా నిర్థారణ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. మీకు కూడా కరోనా సోకిందనే అనుమానం ఉంటే.. వెంటనే ఈ కాఫీతో కోవిడ్ టెస్టు ట్రై చేయొచ్చు.
Read Also : Kaikala Satyanarayana: అత్యంత విషమంగా కైకాల ఆరోగ్య పరిస్ధితి..!

ట్రెండింగ్ వార్తలు