Kaikala Satyanarayana: అత్యంత విషమంగా కైకాల ఆరోగ్య పరిస్ధితి..!

టాలీవుడ్ సీనియర్ నటుడు, నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ (88) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో..

Kaikala Satyanarayana: అత్యంత విషమంగా కైకాల ఆరోగ్య పరిస్ధితి..!

Kaikala Satyanarayana

Updated On : November 20, 2021 / 9:22 PM IST

Kaikala Satyanarayana: టాలీవుడ్ సీనియర్ నటుడు, నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ (88) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తుండగా తాజాగా అపోలో వైద్యులు కైకాల హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. కైకాల శనివారం ఉదయం తీవ్ర జ్వరం.. శ్వాస ఇబ్బందితో అస్వస్థతకు గురై అపోలో ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు ప్రకటించారు.

Unstoppable with NBK: బాలయ్యతో రోజా.. మరో క్రేజీ ఎపిసోడ్ ఖాయం?

అప్పటి నుండి ఆయనకు వెంటిలెటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నారని.. ఆయన మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ కావడంతో చికిత్సకు ఆశించినంత మేర స్పందించడం లేదని బులిటెన్ లో తెలిపారు. కైకాల ఆరోగ్య పరిస్థితి విషమం అనే వార్త తెలియడంతో ఆయన అభిమానులను, టాలీవుడ్ నటులు ఆందోళన చెందుతున్నారు. కైకాల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు.

Etharkkum Thunindhavan: సూర్య నెక్స్ట్ సినిమా.. థియేటర్‌లోనా.. ఓటీటీలోనా?

గత నెల 30న కూడా ఒకసారి కైకాల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా తిరిగి కోలుకున్నారు. అంతకు ముందు కూడా కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లోని తన నివాసంలో కాలు జారిపడగా.. సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నారు. ఇప్పుడు కూడా అలాగే తిరిగి కోలుకోవాలని ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు. గత 60 ఏళ్ల సుదీర్ఘ సినీ కెరీర్ లో కైకాల సుమారు 777 సినిమాల్లో వివిధ పాత్రలకు జీవం పోసి అలరించి నటసార్వభౌముడిగా కీర్తి గడించారు.