Etharkkum Thunindhavan: సూర్య నెక్స్ట్ సినిమా.. థియేటర్‌లోనా.. ఓటీటీలోనా?

ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ సినిమాల్ని ధియేటర్లో రిలీజ్ చెయ్యకపోయినా.. ఓటీటీలో మంచి హిట్ అందుకుని సత్తా చూపించాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. రెండు డిఫరెంట్ సినిమాలు చేసిన సూర్య..

Etharkkum Thunindhavan: సూర్య నెక్స్ట్ సినిమా.. థియేటర్‌లోనా.. ఓటీటీలోనా?

Etharkkum Thunindhavan

Etharkkum Thunindhavan: ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ సినిమాల్ని ధియేటర్లో రిలీజ్ చెయ్యకపోయినా.. ఓటీటీలో మంచి హిట్ అందుకుని సత్తా చూపించాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. రెండు డిఫరెంట్ సినిమాలు చేసిన సూర్య.. ఈసారి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో తన ఫ్యాన్స్ ని టార్గెట్ చేస్తున్నారు. కెరీర్ లో 40వ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సూర్య.. ఈ సినిమాని ఎప్పుడు, ఎక్కడ రిలీజ్ చెయ్యబోతున్నారో అని ఆసక్తిగా మారింది.

Chiru 154: మలయాళ సినిమా కథతోనే చిరుతో బాబీ సినిమా?

ఆకాశమే నీహద్దురా అన్నట్టు తమిళ్ స్టార్ హీరో సూర్య.. కెరీర్ ని స్పీడప్ చేస్తున్నాడు. అసలు గ్యాప్ లేకుండా ఒక వైపు హీరోగా మరో వైపు ప్రొడ్యూసర్ గా డ్యూయల్ రోల్ లో సూపర్ హిట్లు కొడుతున్నాడు. లేటెస్ట్ గా మరో సూపర్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నానంటూ అనౌన్స్ చేసేశారు సూర్య. తన కెరీర్ లో 40వ సినిమా అయిన ఎదర్కుమ్ తునిందవన్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు ఈ తమిళ్ స్టార్.

Rajamouli: సల్మాన్‌తో జక్కన్న భేటీ.. వెనుక అసలు కథేంటి?

సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ లో పాండిరాజా డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ కి సంబందించి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది టీమ్. ఫ్యాన్స్ ని టార్గెట్ చేస్తూ.. కంప్లీట్ మాస్ లుక్ లో కనిపిస్తున్న సూర్య ఈ సినిమాని ఫిబ్రవరి 4న ధియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. సూర్య తన లాస్ట్ రెండు సినిమాలు ఓటీటీలోనే రిలీజ్ చేశాడు. ఆకాశమే హద్దురా, జై భీమ్ ఈ రెండు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయినా.. సూపర్ సక్సెస్ అందుకున్నాడు సూర్య.

Pushpa: బన్నీ మాసీనెస్.. ఫ్యాన్స్‌ని ఎలా ఎంగేజ్ చేయబోతున్నాడు?

సూర్య తన 40వ సినిమాలో ఇంటెన్స్ యాక్షన్ చేస్తూ కంప్లీట్ మాస్ గా కనిపిస్తున్నాడు. తెలుగు, తమిళ్ లో రిలీజ్ అని ముందే అనౌన్స్ చేసిన మేకర్స్.. అందరినీ ఇంప్రెస్ చేసేలా సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సూర్య కత్తి పట్టుకుని సమరానికి సై అంటున్నాడు. ఈ ఇంట్రస్టింగ్ మూవీతో పాటు వెట్రిమారన్ తో వాడివసల్, గౌతమ్ మీనన్ తో మరో సినిమా కమిట్ అయ్యి ఫుల్ బిజీగా ఉన్నాడు సూర్య.