Curry leaves to prevent hair and skin related problems and help to lose weight!
Curry Leaves : కరివేపాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇప్పట్లో అందరు కరివేపాకు చెట్లని ఇంటి ఆవరణలోనే పెంచుకుంటున్నారు. కరివేపు మంచి సువాసనతో కూడి ఉండగా, ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని ఔషద గుణాలు అధికంగా ఉంటాయి. వంటల్లో కరివేపాకును వాడడం వల్ల వంటల రుచి, వాసన పెరుగుతుంది. అయితే చాలా మంది కూరల్లలో కరివేపాకును ఏరి పక్కకు పెడుతుంటారు. కరివేపాకులో ఉండే ఔషధ గుణాల గురించి తెలిస్తే మాత్రం అసలు వదిలిపెట్టరు. ఆరోగ్యానికి కరివేపాకు ఏవిధంగా సహాయపడుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
కరివేపాకులో ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్, పిండి పదార్థాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. పిల్లల ఎదుగుదలకు కరివేపాకు ఎంతగానో సహాయపడుతుంది. కరివేపాకును తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. కంటి ఆరోగ్యాన్ని పెంచడంలో కరివేపాకు దివ్యౌషధంగా పని చేస్తుంది. బరువు తగ్గాలన్న ఆలోచనతో ఉన్నవారికి కరివేపాకుతో సహాయకారిగా పనిచేస్తుంది. కరివేపాకులోకార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి, దీని కారణంగా జీర్ణవ్యవస్థ బాగా పని చేస్తుంది. బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో, జ్ఞాపకశక్తిని పెంచడంలో కరివేపాకు సమర్థవంతంగా పని చేస్తుంది.
కరివేపాకును రోజు వారి ఆహారంలో తీసుకోవడం మానసిక ఒత్తిడి తగ్గుతుంది. వేవిళ్లతో బాధపడుతున్న గర్భిణీ స్ర్తీలు కరివేపాకు రసంలో రెండు స్పూన్ల నిమ్మరసం కొద్దిగా తేనెను కలిపి తీసుకోవడం వల్ల వెంటనే వేవిళ్లు తగ్గిపోతాయి. శరీరానికి అవసరమైన విటమిన్ ఏ మరియు సీ ని అందిస్తుంది. ఆహారంలో కరివేపాకు వేస్తే అది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. షుగర్ వ్యాధితో బాధపడే వారు రోజూ పరగడుపున నాలుగు కరివేపాకు ఆకులను నమిలి తినడం వల్ల షుగర్ వ్యాధిని అదుపులో ఉంచవచ్చు.
జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడే వారు నూనెలో కరివేపాకును వేసి వేడి చేయాలి. నూనె చల్లారిన తరువాత ఆ నూనెను తలకు రాసి మర్దనా చేయాలి. ఇలా కొన్ని రోజుల పాటు ప్రతిరోజూ చేయడం వల్ల తెల్లబడిన జుట్టు నల్లగా మారతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. మజ్జిగలో కొద్దిగా కరివేపాకు రసాన్ని కలిపి తాగినా కూడా జుట్టుకు మేలు కలుగుతుంది. వాతావరణ కాలుష్యం వల్ల, మానసిక ఒత్తిడి వల్ల, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది చిన్న వయసులోనే జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. రోజూ కరివేపాకును తినడం వల్ల శరీరంలో ఉన్న బ్యాక్టీరియా నశించి ఫంగల్ ఇన్ ఫెక్షన్ లు రాకుండా ఉంటాయి. నీటిలో ఒక టీ స్పూన్ కరివేపాకు రసం, ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసి కషాయంలా చేసుకోవాలి. తరువాత అందులో ఒక టీ స్పూన్ తేనెను కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల బద్దకం తగ్గి ఉత్సాహంగా ఉంటారు. కరివేపాకు పేస్ట్ ను చర్మం పై మంట, దురదలు ఉన్న చోట రాయడం వల్ల ఆయా సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.
కరివేపాకును ఖాళీ కడుపుతో తింటే బరువు తగ్గొచ్చు. ఒక గ్లాసు నీటిని లో 10-15 కరివేపాకులను వేసుకోవాలి. కొద్దిసేపు తక్కువ మంట మీద మరిగించాలి. నీళ్లు కాస్త చల్లారిన తర్వాత వడగట్టి సేవించాలి. ఇందులో కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలుపుకుని తాగినా బరువు సులభంగా తగ్గవచ్చు.