Weight Loss : బరువు తగ్గాలనుకుంటున్నారా? ఐతే ఈ ఐదింటిని మీ ఆహారంలో భాగం చేసుకోండి!

అధిక బరువుతో చాలామంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోవడంతో అనారోగ్యం బారినపడుతున్నారు. లావు పెరగడంతో కొద్దీ దూరం నడిచినా అలసటగా ఫీలవుతున్నారు. ఈ నేపథ్యంలోనే బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తూ.. కసరత్తులు చేస్తున్నారు.

Weight Loss : అధిక బరువుతో చాలామంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోవడంతో అనారోగ్యం బారినపడుతున్నారు. లావు పెరగడంతో కొద్దీ దూరం నడిచినా అలసటగా ఫీలవుతున్నారు. ఈ నేపథ్యంలోనే బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తూ.. కసరత్తులు చేస్తున్నారు. ఫిట్ నెస్ కోసం పాట్లు పడుతున్నారు. జీవనశైలిపై పెరుగుతున్న అవగాహనతో బరువు అదుపులో ఉంచుకోవడానికి యోగ, వ్యాయామం చేయడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకుంటున్నారు.

నిజానికి బరువు పెరగడం అనేది అనారోగ్య సంబంధ సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా ఈ కోవిడ్ కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యవసరంగా మారింది. అయితే చాలామంది బరువు తగ్గడానికి లో క్యాలరీ ఫుడ్ తీసుకుంటున్నారు. అయితే ఇది ఆరోగ్యకరమైన ఎంపిక కాదని వైద్యులు చెబుతున్నారు. ఆకలితో ఉండటానికి బదులుగా ఆరోగ్యకరమైన ఆహారం ఎంచుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. డ్రై ఫ్రూట్స్ వంటివి తీసుకుంటే బరువు తగ్గడం సులువని చెబుతున్నారు.
అదనపు బరువు తగ్గడానికి ఈ ఐదు డ్రై ఫ్రూట్‌స్

బాదం

బరువు తగ్గేందుకు బాదం ఎక్కువగా సహాయపడుతుంది. వేళకాని వేళలో ఆకలి నుంచి ఉపశమనం పొందడానికి బాదం తినాలని నిపుణులు చెబుతున్నారు. నిజానికి బాదం పప్పును తినడం వల్ల మీ ఆకలి కూడా తీరుతుంది. అవి చాలా తక్కువ కేలరీలు మరియు పూర్తి పోషకాలను కలిగి ఉంటాయి, ఇవి త్వరగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. బాదం బొడ్డు కొవ్వు మరియు మొత్తం బాడీ మాస్ ఇండెక్స్ తగ్గించడంలో సహాయపడతాయి. బాదం ఫైబర్‌తో నిండి ఉంది. ఆకలిగా ఉన్న సమయంలో బాదం తినడం వలన ఆకలి తీరుతుంది. ప్రతి రోజు నాలుగు నుంచి ఆరు బాదం గింజలు తింటే ఆరోగ్యానికి చాలామంచిది.

ఎండుద్రాక్ష

చాలామందికి తినే టైం కాకముందు విపరీతంగా ఆకలి అవుతుంది. వేళకాని వేళల్లో అయ్యే ఆకలిని ఎండు ద్రాక్షతో తీర్చవచ్చు. వీటిలో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఎండుద్రాక్షలో ఆకలిని అణచివేసే లక్షణాలు ఉన్నాయి.. ఇవి శరీరంలో కొవ్వు కణాలను తగ్గిస్తాయి. అలాగే బొడ్డు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. ప్రతి రోజువారి వీటిని చేర్చుకోవచ్చు.

 

జీడిపప్పు

చాలామంది జీడిపప్పు వలన శరీరంలో కొవ్వు చేరుతుందని అంటుంటారు. కానీ పరిమితంగా జీడిపప్పు తింటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. జీడిపప్పులో మెగ్నీషియం చాలా ఉంటుంది, ఇది జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నప్పుడు మీ డైట్ లో ఇది చేర్చుకోవడం చాలా మంచిది. అలాగే జీడిపప్పులో ప్రోటీన్ ఉంటుంది ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

 

వేరుశెనగ

వేరుశెనగలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు మరియు బహుళ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉంటాయి, ఇవి శరీరంలో వేడిని తగ్గిస్తాయి. వేరుశెనగ తినడం శరీరానికి బలాన్ని ఇస్తుంది మరియు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

వాల్‌నట్స్

వాల్ నట్స్ కూడా బరువు తగ్గడంలో సహాయపడతాయి. వీటిలో ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. మీరు ఆకలితో ఉన్నప్పుడు వాల్‌నట్స్ తింటే, అది మీ పొట్టను ఎక్కువ సమయం నిండుగా ఉంచుతుంది. ఇవి మెదడులో ఉండే సెరోటోనిన్ స్థాయిని పెంచుతాయి. ఇవి ఆకలిని తగ్గిస్తాయి. ప్రతిరోజూ కొన్ని వాల్‌నట్‌లను తినడం వల్ల బరువు వేగంగా తగ్గుతారు.

 

ట్రెండింగ్ వార్తలు