Earth Rotation: భూమి ఒక రోజు ముందుగానే తిరిగేసింది..

సైంటిస్టులు దాని అటామిక్ గడియారాలను ఉపయోగించి భ్రమణ వేగాన్ని కొలవడానికి మొదలుపెట్టినప్పటి నుంచి అతి తక్కువ రోజును గుర్తించారు. 2022 జూన్ 29న భూమి 24గంటల కంటే ముందుగానే 1.59 మిల్లీ సెకన్ల కంటే తక్కువ సమయంలోనే భ్రమించింది. 2020 తర్వాత రికార్డ్ వేగమిదే.

 

Earth Rotation: సైంటిస్టులు దాని అటామిక్ గడియారాలను ఉపయోగించి భ్రమణ వేగాన్ని కొలవడానికి మొదలుపెట్టినప్పటి నుంచి అతి తక్కువ రోజును గుర్తించారు. 2022 జూన్ 29న భూమి 24గంటల కంటే ముందుగానే 1.59 మిల్లీ సెకన్ల కంటే తక్కువ సమయంలోనే భ్రమించింది. 2020 తర్వాత రికార్డ్ వేగమిదే.

భూమి ప్రతి 24గంటలకు తిరుగుతుండటం వల్ల సూర్యాస్తమయం, సూర్యోదయం జరుగుతున్నట్లు కనిపిస్తుంది. సాధారణంగా భూమి భ్రమణాన్ని పూర్తి చేయడానికి కాలక్రమేణా ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది. భూమి ఒక భ్రమణాన్ని పూర్తి చేయడానికి పట్టే కాలం మిల్లీ సెకన్లలో వ్యత్యాసం కనిపిస్తుంది.

కానీ, ఇటీవలి సంవత్సరాల్లో భూమి వేగం పెరుగుతూ వస్తుందట. 2020 సంవత్సరం మొత్తంలో అతి తక్కువ సమయంతో గడిచిన 28రోజులు నమోదయ్యాయట. 2021 జులై 19న 1.47 మిల్లీ సెకన్లలోపై భ్రమణం పూర్తయింది. 2021లోనూ షార్టెస్ట్ డే నమోదైంది కానీ, 2020 కంటే తక్కువ కాదు.

Read Also : భూమిని తాకనున్న సౌర తుపాన్..గంటకు 16 లక్షల కిమీ వేగంతో భూమి వైపు

అదే జూన్ 29న కొత్త రికార్డ్ నమోదు చేసింది భూమి. 1.59 మిల్లీ సెకన్ల కంటే ముందే తిరిగేసింది. ఒక నెల తర్వాత అంటే జులై 26న 1.50మిల్లీ సెకన్ల కంటే ముందే తిరిగింది. ఇటీవలి కాలంలో ఇదే రికార్డ్ అని చెబుతున్నారు సైంటిస్టులు.

ట్రెండింగ్ వార్తలు