Body Ageing: ఇవి చేస్తున్నారా.. ముసలితనం ముందే రావడం ఖాయం

ఒక యాబై ఏళ్లు వచ్చాయనుకోండి.. అద్ధంలో చూసుకున్నప్పుడు మీ ముఖం కనిపించిన తీరుని బట్టి సరిపెట్టుకోవాల్సిందే. కానీ, ముప్పై ఏళ్ల వయస్సుకే 50ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తే...  తెలియకుండానే

Body Ageing: ఒక యాబై ఏళ్లు వచ్చాయనుకోండి.. అద్ధంలో చూసుకున్నప్పుడు మీ ముఖం కనిపించిన తీరుని బట్టి సరిపెట్టుకోవాల్సిందే. కానీ, ముప్పై ఏళ్ల వయస్సుకే 50ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తే…  తెలియకుండానే మనం చేసే తప్పులు ముఖంపై చాలా చెడు ప్రభావం చూపిస్తాయి. చాలా సింపుల్ మార్పులతో చర్మం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

స్క్రీన్స్ చూడటం తగ్గించాలి..
బ్లూ లైట్ టూ మచ్ గా కళ్ల మీద పడటం.. వయస్సును పెంచినట్లు చేస్తుంది. అందుకే వీలైనంత వరకూ కంప్యూటర్ స్క్రీన్లు, ఫోన్ స్క్రీన్లకు దూరంగా ఉండాలి. 2019లో పబ్లిష్ అయిన ఏజింగ్ అండ్ మెకానిజమ్స్ ఆఫ్ డిసీజ్ జర్నల్‌లో ఎక్కువ సేపు బ్లూ లైట్ చూడటం వల్ల బ్రెయిన్ లోని, కళ్లలోని కణాలు డ్యామేజ్ అవుతాయని ఉంది. వీలైనంత వరకూ సహజమైన కాంతి బెటర్ అని.. స్క్రీన్ టైం తగ్గించుకుంటే మంచిదని నిపుణులు కూడా చెబుతున్నారు.

Blue Light

 

మాయిశ్చరైజర్ వాడకపోవడం
ముఖానికి మాయిశ్చరైజర్ వాడకపోడంతో చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఏజ్ అయినట్లుగా కనిపించే కారకాలలో మొదటిది ఇదే. మాయిశ్చరైజర్ చర్మంలో నీటి శాతాన్ని పెంచేందుకు ఉపయోగపడుతుంది. యూత్ లాంటి చర్మం కనిపించేందుకు కారణమవుతుందని అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ చెప్తుంది.

Moisturizer

సరైన నిద్ర లేకపోవడం:geing
శరీరానికి సరిపడ నిద్రలేకపోవడం అనేది యూత్ నెస్ ను తగ్గించేస్తుంది. క్లినికల్ అండ్ ఎక్స్‌పెరిమెంటల్ డెర్మటాలజీ లో పబ్లిష్ అయిన స్టడీ ప్రకారం.. సరిపడ నిద్ర ఉండే మహిళల్లో 30శాతం మందికి ముసలితనమే కనిపించలేదట. నిజానికి కచ్చితంగా రోజుకు 7గంటల పాటు నిద్ర తప్పనిసరి.

Sleep Less

ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం:
ఆల్కహాల్ అనేది చర్మాన్ని పూర్తిగా డీహైడ్రేట్ చేస్తుంది. ముడతలు, ఎర్రగా మారిపోవడం, కళ్లు వాసినట్లుగా ఉండటం లాంటి కనిపిస్తాయి. క్యాన్సర్, హార్ట్ డిసీజ్ వీటన్నిటినీ తగ్గించుకోవాలంటే మోతాదుకు మించి తాగకపోవడమే ఉత్తమం.

Alcohol Consumption

తీపి తక్కువగా తినడం
రీసెర్చ్ స్టడీస్ లో తెలిసిన దాని ప్రకారం.. షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఉత్పత్తి అయ్యే కార్బొహైడ్రేట్స్ వయస్సు ఎక్కువగా కనిపించేలా చేస్తుంది. ముడతలు ఎక్కువ చేసి.. చర్మాన్ని కాంతివంతంగా చేసే ప్రొటీన్లను కూడా డామినేట్ చేస్తుంది. స్వీట్స్ తో పాటు బాగా పండిన పండ్ల కంటే దోరగా లేదా పచ్చిగా ఉన్నవి తినడమే మంచిదట.

Sweet Eating

ట్రెండింగ్ వార్తలు