Covid Vaccine-Heart Issue : కొవిడ్ వ్యాక్సిన్‌తో గుండె సమస్యలు.. యువతలోనే ఎక్కువ!

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న చాలామందిలో గుండె సమస్యలు అధిక స్థాయిలో పెరుగుతున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. కొవిడ్ వ్యాక్సినేషన్‌తో గుండె సంబంధిత సమస్యలకు సంబంధం ఉందని CDC (డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) తన నివేదకలో పేర్కొంది.

Covid Vaccine Link to Heart Issue : కరోనా వ్యాక్సిన్ తీసుకున్న చాలామందిలో గుండె సమస్యలు అధిక స్థాయిలో పెరుగుతున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. కొవిడ్ వ్యాక్సినేషన్‌తో గుండె సంబంధిత సమస్యలకు సంబంధం ఉందని CDC (డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) తన నివేదకలో పేర్కొంది. ప్రత్యేకించి యువకుల్లో mRNA వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న తర్వాత వారిలో గుండెలో మంట రావడం వంటి హృదయ సంబంధ సమస్యలు కనిపిస్తున్నాయని తెలిపింది.

మయోకార్డిటిస్ అనేది గుండె కండరాల వాపుతో కూడిన వ్యాధి. లక్షణాలు జ్వరం అలసట, అలాగే ఊపిరి తీసుకోలేకపోవడం వంటివి కనిపిస్తాయి. తీవ్రమైన ఛాతీ నొప్పిని కలిగి ఉంటుంది. ఛాతిపై ముందుకు వాలినప్పుడు తీవ్రమైన నొప్పిగా ఉంటుంది.. వెనుకకు వాలినప్పుడు కొద్దిగా నొప్పి తగ్గుతున్నట్టుగా అనిపిస్తుంది. దీని చికిత్సలో ఇబుప్రోఫెన్ వంటి యాంటీ డ్రగ్స్ వాడొచ్చు. లేదంటే IVIG అనే ఇంట్రావీనస్ డ్రగ్స్ కూడా తీసుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.

ఇప్పటివరకూ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారిలో మొత్తంగా 226 మైక్రో కార్డియాటిస్ లేదా పెరికార్డియాటిస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ కేసుల్లో అధికంగా 30ఏళ్లకు పైబడిన యువకులే ఉన్నారని సీడీసీ డిప్యూటీ డైరెక్టర్ Tom Shimabukuro పేర్కొన్నారు. దీనిపై లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాక్సినేషన్ కారణంగానే గుండె సమస్యలు వస్తున్నాయా లేదా అనేది ధ్రువీకరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

సాధారణంగా 30ఏళ్ల వయస్సు వారిలో 100 కంటే తక్కువగా ఈ తరహా కేసులు వస్తున్నాయని భావిస్తున్నట్టు చెప్పారు. యువకులు నుంచి పెద్దవారిలో 20ఏళ్ల వయస్సు నుంచే వ్యాక్సిన్ తీసుకున్న సగానికి పైగా ఈ మైక్రోకార్డియాటిస్ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు.

మే చివరి నాటికి ఆసుపత్రిలో చేరిన చాలావరకు కేసులను డిశ్చార్జ్ చేశారు. ఎంత మంది బాధితులను ఆస్పత్రిలో చేర్పించారో స్పష్టంగా తెలియదు. పదిహేను మంది బాధితులు ఆసుపత్రిలో ఉన్నారు. ముగ్గురు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో ఉన్నారు. ఐసియులో ఉన్న ఇద్దరు రోగులకు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. 220 కేసులలో కోలుకున్న బాధితుల సమాచారం ఉందని సీడీసీ పేర్కొంది. ఈ కేసులలో 80 శాతానికి పైగా, బాధితుల ఆరోగ్యం ఎలాంటి చికిత్స లేకుండానే మెరుగైంది.

ట్రెండింగ్ వార్తలు