ఆధ్యాత్మికంగానే కాదు.. సైన్స్ పరంగానూ ఉపవాసం పాటించడం మంచిదే అంటున్నారు నిపుణులు. ఇటీవలి కాలంలో ఉపవాసాలు మంచి ట్రెండింగ్‌గా మారాయి. రోజులో ఎక్కువ సేపు తినకుండా ఉంటే కేలరీలు ఎక్కువ ఖర్చు అవుతాయని, దానివల్ల తాత్కాలికంగా కనిపించే నీరసమే కానీ, శరీరానికి చాలా మంచిదంటున్నారు.
ద ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అనే మీడియాలో ఓ పరిశోధన ఇలా వెల్లడించింది. సరైన సమయంలో తినకపోవడం, తరచూ భోజనవేళల్లో మార్పులు చేస్తుండటం శరీరానికి అదనపు బరువు పెరిగేలా చేస్తాయట. దీనికి వ్యతిరేకంగా రోజులో 18గంటల పాటు తినకుండా ఉండటమనేది జీవ క్రియలో మార్పులు తీసుకొస్తుందని వెల్లడించారు.
ఉపవాసాల్లోని రెండు రకాల కారణంగా బీపీ(రక్తపోటు) తగ్గడం కూడా ఓ బెనిఫిట్. ఉపవాసాలు పాటించడం.. చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉండటమనేవి ఇంటర్ లింక్‌తో ఉంటాయి. ఈ సర్వేలో హెల్త్ బెనిఫిట్స్ వస్తాయని చెప్పారే కానీ, ఇలా బరువు తగ్గడం వల్ల వచ్చే ఇబ్బందులు చెప్పలేదు.
రీసెర్చర్స్‌లో ఒకరైన జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సటీకి చెందిన మార్క్ మాట్‌సన్ ఇలా వెల్లడించారు. రోజుల లెక్కల్లో ఉపవాసం ఉండటం, ఒక రోజంతా ఉపవాసం ఉండటం వంటి వాటి ద్వారా కొవ్వు మెటబాలిజంలో కలిసిపోతుంది. అలా శరీర బరువు తగ్గిపోతుంది. అంతేకాకుండా జీవ కణాల ఆరోగ్యం మెరుగై అదనపు ఆరోగ్యం వస్తుంది.
మొత్తానికి రోజుకు 18గంటల పాటు ఉపవాసం ఉండటం మంచిదేనని సూచిస్తున్నారు. ఈ ఉపవాసమనేది వైద్యుల సూచన మేరకు పాటించడం శ్రేయస్కరం.