Heart Attacks : హార్ట్ అటాక్ ఎవరిలో వస్తుంది.. అసలు లక్షణాలేంటో తెలుసా..!

హార్ట్ అటాక్ వచ్చిన వారికి ట్రీట్మెంట్ అందకపోతే కొద్ది క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోవచ్చు. కానీ, అది వచ్చే సూచనలను ముందుగానే పసిగడితే రాకుండా జాగ్రత్త పడొచ్చు లేదంటే సరైన సమయానికి ట్రీట్మెంట్ అందించొచ్చు.

Heart Attacks: హార్ట్ అటాక్ వచ్చిన వారికి ట్రీట్మెంట్ అందకపోతే కొద్ది క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోవచ్చు. కానీ, అది వచ్చే సూచనలను ముందుగానే పసిగడితే రాకుండా జాగ్రత్త పడొచ్చు లేదంటే సరైన సమయానికి ట్రీట్మెంట్ అందించొచ్చు. వాటిల్లో ఓ 4లక్షణాల గురించి తెలుసుకుందాం. నీరసం, శ్వాసలో ఇబ్బంది, కడుపులో నొప్పి అని డెన్మార్క్ స్టడీ చెప్తుంది.

వృద్ధుల్లో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ప్రత్యేకించి మహిళల్లో.. ఆ సమయంలో ఎమర్జెన్సీలా అనిపించకపోవచ్చని అమాలీ లీక్కెమార్క్ మాల్లోర్ అనే వ్యక్తి చెబుతున్నారు. దీనిని బట్టి పేషెంట్లు లక్షణాలు బయటపడ్డ వెంటనే అర్జెంట్ గా అలర్ట్ అవ్వాల్సి ఉటుంది.

యూరోపియన్ హార్ట్ జర్నల్ కార్డియోవాస్క్యూలర్ కేర్ రీసెర్చర్ల అనాలసిస్ ప్రకారం.. 2014 నుంచి 2018 మధ్యలో 24గంటల మెడికల్ హెల్ప్ లైన్ కు హార్ట్ అటాక్ అంటూ 7వేల 222కాల్స్ వచ్చాయట. వారందరిలో మూడు రోజుల క్రితం చెస్ట్ పెయిన్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయని చెబుతున్నారు.

24శాతం మంది పేషెంట్లలో శ్వాస సమస్యలు 30 నుంచి 59ఏళ్ల మధ్యలో ఎక్కువగా ఉంది. అది మహిళల్లో తక్కువ. వృద్ధులలో మాత్రం తరచుగానే ఈ లక్షణాలు కనిపిస్తాయట. హెల్ప్ లైన్ కు కాల్ చేసిన వారిలో 76శాతం మంది అంబులెన్స్ కోసం చెస్ట్ పెయిన్ అనే చెబుతుంటారు.

ట్రెండింగ్ వార్తలు