Police Dogs Farewell: మనసుల్ని కదిలిస్తున్న పోలీస్ కుక్కల సెల్యూట్‌

కుక్కలు ధైర్యంగా ఉండటంతో పాటు విధేయతతోనూ, జాగ్రత్తతో పనిచేస్తాయి కాబట్టే వాటిని బెస్ట్ ఫ్రెండ్ గా చూసుకుంటాం. సమయం పెరుగుతున్న కొద్దీ వాటితో ఏర్పరచుకున్న బాండింగ్ మనతో పాటే వాటిలోనూ పెరుగుతూ ఉంటుంది. సాధారణంగా కుక్కలను రక్షణ కల్పించడానికి అలర్ట్ చేయడం కోసమే పెంచుతారు.

Police Dogs Farewell: కుక్కలు ధైర్యంగా ఉండటంతో పాటు విధేయతతోనూ, జాగ్రత్తతో పనిచేస్తాయి కాబట్టే వాటిని బెస్ట్ ఫ్రెండ్ గా చూసుకుంటాం. సమయం పెరుగుతున్న కొద్దీ వాటితో ఏర్పరచుకున్న బాండింగ్ మనతో పాటే వాటిలోనూ పెరుగుతూ ఉంటుంది. సాధారణంగా కుక్కలను రక్షణ కల్పించడానికి అలర్ట్ చేయడం కోసమే పెంచుతారు.

అలాగే సెక్యూరిటీ డాగ్స్, పోలీస్ డాగ్స్ రెగ్యూలర్ ఆఫీసర్ల మాదిరే సేవలు అందిస్తుంటాయి. ఏ మాత్రం స్వార్థం లేకుండా చేసే వాటి పనులు సీనియారిటీ ఉన్న ఆఫీసర్ తో పాటూ ఉంటాయి. అలా సేవలందించే కుక్కలు ఎంత ఆదరిస్తాయో.. మరోసారి రుజువైంది.

మనుషులతో పాటు తిరిగిన కుక్కలు తమ పెంపుడు మనిషి చనిపోతే బెంగపెట్టుకుని.. మౌనంగా రోధించడం గమనించే ఉంటాం. కానీ, రెండు పోలీస్ కుక్కలు ఏడేళ్ల వయస్సులో చనిపోయిన వాటి కొలీగ్‌కు సెల్యూట్ చేసిన సీన్ హార్ట్ బ్రేకింగ్ గా మారింది.

ఆ ఇమేజ్ ను ఐపీఎస్ ఆఫీసర్ షంషీర్ సింగ్ ట్విట్టర్లో షేర్ చేశారు. దానిపై పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు