పొట్టిగా ఉన్నవారు పొడవుగా ఉన్నవారిని చూస్తే అసూయపడుతారు. అంత పొడవు పెరగడం ఎలా అని, కలలు కంటుంటారు చాలామంది. అంతేకాదు.. ఎత్తు పెరగడం కోసం ఎవరేది చెప్తే అది పాటిస్తుంటారు. కనిపించిన మందునల్లా వాడుతుంటారు. చివరికి ఏ ఫలితమూ రాక అసహనంగా అయిపోతారు. కాని ఆహారమూ, వ్యాయామాలకు సంబంధించి కొన్ని చిట్కాలు పాటిస్తే కొద్దిగానైనా ఎత్తు పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
సాధారణంగా 18 – 20 ఏళ్ల వయసు తర్వాత శరీరంలో కణాలు విభజన చెందే ప్రక్రియ చాలా వరకు ఆగిపోతుంది. అందువల్ల ఆపైన ఎత్తు పెరగరు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక వ్యక్తి ఎంత హైట్ ఉండాలనే అంశం వంశపారంపర్యంగా వస్తుంది. తల్లిదండ్రులు ఎక్కువ హైట్ ఉంటే పిల్లలు కూడా హైట్ పెరుగుతారు. కాబట్టి 20 ఏళ్లు దాటిన తరువాత ఎత్తు పెంచే మందులు ఉన్నాయని ఎవరు చెప్పినా నమ్మోద్దు. మరి ఎత్తుగా పెరగాలనే ఆశ తీరదా అని నిరాశ పడాల్సిన పనిలేదు. సహజమైన పద్ధతుల్లో, ఎటువంటి మందులూ వాడకుండానే పొడవు పెరగొచ్చు. ఇందుకోసం రోజు కాస్త వ్యాయామమూ, మరికాస్త పోషకాహారమూ చేరిస్తే చాలు. ఎదుగుదలకు ఉపయోగపడే మంచి ఆహారం తీసుకుంటే ఎత్తు పెరిగేందుకు అవకాశం ఉంటుంది.
ఎత్తు పెరగడానికి ముఖ్యమైన పోషకాలు ప్రొటీన్లు. కోడిగుడ్లలో కాల్షియం, ప్రొటీన్లు, Vitamin-D లు ఉంటాయి. ఉడికించిన కోడిగుడ్లు రోజూ తీసుకుంటే హైట్ పెరగడానికి సహకరిస్తాయి. పాలలో కూడా ఎత్తు పెరగడానికి కావలసిన మూడు ముఖ్యమైన పోషకాలైన కాల్షియం, విటమిన్ డి, ప్రొటీన్లు అన్నీ ఉంటాయి. కాబట్టి పాలు ఎక్కువగా తీసుకోవాలి. మాంసాహారం ద్వారా లభించే ప్రొటీన్లు కండరాల ఎదుగుదలకు తోడ్పడతాయి.
ఎక్కువ ఎత్తులో ఉండే కొమ్మలను అందుకోవడానికి మెడ సాగదీసి సాగదీసి జిరాఫీ మెడ పొడవుగా అయిందంటారు. ఇది నిజమే. అదీ ఒక రకమైన వ్యాయామమే. కండరాలను సాగదీసే కొన్ని చిన్న చిన్న వ్యాయామాలు హైట్ పెరగడానికి సహకరిస్తాయి. అవేంటో తెలుసా.. స్కిప్పింగ్, ఎగరడం వల్ల కండరాలకు రక్తప్రసరణ పెరుగుతుంది. దీంతో శరీర పెరుగుదల మెరుగుపడుతుంది. ఎత్తు పెరగడానికి నిలువుగా వేలాడటం అన్నది సాధారణంగా అందరికీ తెలిసిందే. చిన్నప్పటి నుంచి ఇలా రాడ్స్ కి వేలాడితే ఎత్తు పెరిగే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది.