2019లో యువతరాన్ని ప్రభావితం చేసింది వీళ్లే

  • Publish Date - December 30, 2019 / 08:59 AM IST

ప్రపంచంలో యువత ఎక్కువగా ఉన్న దేశం ఇండియా. భారతదేశంలో ఉన్న జనాభాలో 65శాతం మంది యువకులే. అందులో 35ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్నవారే ఎక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 2019లో దేశంలో యువతను ఎక్కువగా ప్రభావితం చేసిన వారి లిస్ట్ ను ఒక్కసారి చూద్దాం.

యశ్ (33):


కన్నడ నటుడు యశ్. కన్నడంలో అనేక మాస్ మూవీస్ ద్వారా కర్నాటక ప్రజలకు దగ్గరైన యశ్ 2018 డిసెంబర్ లో విడుదలైన ‘KGF’ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీతో పాటు అభిమానులను సంపాదించుకున్నాడు. శాండిల్ వుడ్ లో అత్యధిక పారితోషకం తీసుకున్న వారిలో నెం.1 స్థానంలో ఉన్న యశ్
2019లో దేశవ్యాప్తంగా ఎక్కువగా యువతను ప్రభావితం చేసిన వారిలో మెదటి స్థానంలో నిలిచాడు. అంతేకాకుండా ఇప్పుడు దేశవ్యాప్తంగా KGF-2 కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

బూమ్రా (26):


ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌ లో బుమ్రా అత్యుత్తమ బౌలర్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. క్రికెట్ అభిమానులకు అయితే పరిచయం అవసరం లేని పేరు. తన అద్భుతమైన బౌలింగ్‌ తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. అతి తక్కువ కాలంలోనే వన్డే మ్యాచ్‌లలో తిరుగులేని బౌలర్‌గా బూమ్రా గుర్తింపు పొందాడు. ఫిబ్రవరీ 2018 నుంచి ODI ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. అంతేకాదు 2019లో దేశవ్యాప్తంగా ఎక్కువగా యువతను ప్రభావితం చేసిన వారిలో ఒకడిగా నిలిచాడు. 

ఆలియా భట్ (26):


భారతదేశంలో మంచి సక్సస్ ఫుల్ ఫీమేల్ యాక్టర్ ఆలియా భట్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఆలియా ఒకరు. ఆమె 2016లో నటించిన ‘డియర్ జిందగీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద 130 కోట్లు వసూల్లు చేసింది. అయితే 2019 టాప్ బాలీవుడ్ హీరోయిన్లలో ఆలియా మొదటి స్థానంలో నిలిచింది. అంతేకాదు 2019లో దేశవ్యాప్తంగా ఎక్కువగా యువతను ప్రభావితం చేసిన వారిలో ఒకరిగా నిలిచింది. 

విరాట్ కోహ్లీ (31):


ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సోమవారం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని తన దశాబ్దపు ఆల్-స్టార్ టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేశాడు. ఈ జట్టులో కేవలం విరాట్ కు మాత్రమే ఈ చోటు దక్కింది. ఇదిలా ఉంటే, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అటు టెస్టు ర్యాంకింగ్స్‌తో పాటు ఇటు వన్డే ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు 2019లో దేశవ్యాప్తంగా ఎక్కువగా యువతను ప్రభావితం చేసిన వారిలో ఒకడిగా నిలిచాడు. 

ఆయుష్మాన్ ఖురానా(35):


ఆయుష్మాన్‌ ఖురానాను తెలుసుకోవాలంటే మీరు నెట్‌ ఫ్లిక్స్‌లోనో, అమేజాన్‌ లోనో అతడి సినిమాలు చూడాలి.  ఏ హీరో చేయని కథలు చేసి అభిమానుల మనసులను దొచుకున్నాడు. ఆయుష్మాన్‌లాంటి వాళ్ల వల్ల బాలీవుడ్‌ కొత్త కథల రచన, నటన సాధ్యమవుతోంది. అంతేకాదు 2019లో దేశవ్యాప్తంగా ఎక్కువగా యువతను ప్రభావితం చేసిన వారిలో ఒకడిగా నిలిచాడు.