Horse paintings : గుర్రాల పెయింటింగ్ ఇంట్లో ఉండొచ్చా..? అప్రమత్తంగా లేకుంటే ఆర్థిక కష్టాలే..!

ఇంట్లో గుర్రాల పెయింటింగులు, బొమ్మలు పెట్టుకోవచ్చా...? పెట్టుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?గుర్రాలు ఎటువంటి యాంగిల్ ఉండాలి..?

  • Updated on- October 11, 2023 / 12:32 PM IST

seven horses

Horse paintings Vastu Tips:  గుర్రం అంటే శక్తికి ప్రతీక. ఎంత దూరం పరుగు పెట్టిన అలసిపోని బలిష్టమైన జంతువు. పూర్వకాలంలో రాజులు గుర్రాలమీదనే ఎంత దూరమైనా ప్రయాణించేవారు. యుద్ధాల్లో గుర్రాలదే ప్రధానపాత్ర. అందుకే రాజుల కోటల్లో గుర్రాలకు ప్రత్యేకమైన కొట్టాలు ఉండేవి. వాటిని గుర్రపుశాల అనేవారు. ఆయా రాజ్యాలకు గుర్రాల శక్తి ఎంత ఉందో శతృరాజులకు తెలియనిచ్చేవారు కాదు. రాజ్యాధినేతలు మేలు జాతి గుర్రాలను పెంచుకునేవారు.

గుర్రం రాయల్టీకి ఐకాన్. గుర్రం బలిష్టమైనదే కాదు రాజ్యాధినేతలకు అండగా..ఇంకా చెప్పాలంటే ఓ ఆయుధంగా ఉపయోగపడేది. వారికి యుద్ధాల్లో వారికి చేదోడు వాదోడుగా ఉండేవి. వారి గుర్రాలకు ప్రత్యేకమైన పేర్లు ఉండేవి. దాంట్లో రాణా ప్రతాప్ సింగ్ కు ఉన్న ప్రత్యేక గుర్రం ఉండేది. ఆ గుర్రం పేరు ‘చేతక్’. జగజ్జేతగా పేరుగాంచిన గ్రీకు వీరుడు అలెగ్జాండర్ గుర్రం పేరు బుసెఫాలస్. మరాఠా యోధుడు చత్రపతి శివాజీ గుర్రం పేరు కృష్ణుడు..ఇలా గుర్రాల గురించి చెప్పుకుంటు పోతే చాలా విశేషాలుంటాయి. మచ్చిక చేసుకున్నవ్యక్తితో జీవితంగా ఉండిపోతాయట.

బతుకమ్మ పండుగ వెనుక ఆసక్తికర కథలు..

చాలామంది ఇంట్లోను..ఆఫీసుల్లోను గుర్రాల పెయింటింగులు ఇంట్లో పెట్టుకుంటుంటారు. డెకరేషన్ కోసం పెట్టుకుంటుంటారు. గుర్రం పెయింటింగ్ ను చూస్తే ఓ దర్పం కనిపిస్తుంది. ఓ కేర్‌లెస్ కనిపిస్తుంది. శక్తి కనిపిస్తుంది. శక్తి అంటే పాజిటివ్. అటువంటి గుర్రాల పెయింటింగులు ఇంట్లో పెట్టుకునే విషయంలో చాలా అనుమానాలు, అపోహలు ఉంటుంటాయి. గుర్రం పెయటింగ్ ఇంట్లో ఉంటే మంచిది కాదని ఇంట్లో సంపద బయటకు గుర్రంలా పరుగు పెట్టి పోతుందని అంటుంటారు. కానీ గుర్రం పెయింటింగ్ పెట్టుకునే స్థానంలో పెట్టుకోవాలని లేదంటే ఆర్థిక ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు వాస్తు నిపుణులు.. మరి ముఖ్యంగా ఏడు గుర్రాలు ఉండే పెయింటింగ్ చాలా పేరొందింది.

గుర్రం నడిచినా..పరుగు పెట్టిన ఓ పవర్ కనిపిస్తుంది. అటువంటి గుర్రాల పెయటింగ్ గురించి తెలుసుకుందాం. కొన్ని పెయింటింగ్స్ సుఖ శాంతులతో పాటు సంపదను తెచ్చిపెడతాయట. ఏడు గుర్రాల పెయింటింగ్ గురించి వాస్తులో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. గుర్రాలు పెరుగుదల, బలం, ధైర్యం , విధేయతకు చిహ్నంగా పరిగణించబడతాయి. జీవితంలో సానుకూల వేగాన్ని తీసుకొస్తాయి. అటువంటి ఏడు గుర్రాల పెయింటింగ్ ఇంట్లో పెట్టుకుంటే శుభాలు కలుగుతాయట.

కొత్తగా వ్యాపారం ప్రారంభించబోయే వారు తమ కార్యాలయంలో కూడా ఈ పెయింటింగ్‌ను ఏర్పటు చేసుకోవడం శుభసూచకమని చెబుతున్నారు వాస్తు నిపుణులు. గుర్రపు బొమ్మలు ఇంటికి పాజిటివ్‌ ఎనర్జీని తీసుకువస్తాయట. గుర్రం అంటే శక్తికి ప్రతీక అయిన గుర్రాల బొమ్మల్ని ఇంట్లో మన చూపు పడే చోట ఉంచితే అదృష్టం కలసివస్తుందట. దీంతో పాటు ధనం లభించటమే కాకుండా అనుకున్న పనులన్నీ నెరవేరుతాయట. కుటుంబ సభ్యులకు ఆరోగ్యం సిద్ధిస్తుందట. భార్యాభర్తల మధ్య అభిప్రాయబేధాలు ఉంటే తొలగిపోతాయట.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఇంట్లో పెట్టుకునే గుర్రపు బొమ్మలు గాల్లో ఎగురుతున్న యాంగిల్ లో ఉంటే మంచిది..వాటికి పగ్గాలు ఉండకూడదు..

అన్ని గుర్రాలు ఒకే దిశలో పరుగెడుతున్నట్టు ఉండాలి..

ఇంట్లో దక్షిణం దిశలో గుర్రపు బొమ్మలను ఉంచితే ఆరోగ్యం కలుగుతుంది. శుభాలు కలుగుతాయి. ధనాభివృద్ధి కలుగుతుంది. ఇంట్లో ఉత్తర దిక్కున గుర్రపు బొమ్మలు ఉంటే అదృష్టం వరిస్తుంది.

గుర్రపు బొమ్మల ఎదురుగా కిటికీలు, తలుపులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలా ఏర్పాటు చేసుకుంటే ఇంట్లోకి శక్తి ప్రసరిస్తుంది.

బెడ్ రూమ్ లో జంట గుర్రాల పెయింటింగ్ గానీ బొమ్మలు గానీ పెట్టుకుంటే దంపతుల మధ్య ఉండే కలహాలు తొలగిపోతాయి.

ఏడు గుర్రాల వాల్‌పోస్టర్ల ఇంట్లో ఉన్న నెగెటివ్‌ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తాయి. అదృష్టం కలసి వచ్చేలా చేస్తాయి.

గుర్రాల ముఖాలు ప్రసన్నంగా కనిపించాలి…కోపంతో ఉన్న గుర్రం బొమ్మ ఇంట్లో పెట్టుకోకూడదు. దీని వల్ల ఇంట్లో అశాంతి కలుగుతుంది.

చిత్రంలో ఉండే ఏడు గుర్రాలు ఒకే రంగులో ఉండాలి..

గుర్రాలు నిలబడి లేదా, కూర్చుని ఉన్న చిత్రాలు కూడా ఇంటికి అంత మంచిది కాదు. దీని వల్ల ఆర్థిక స్థితి దెబ్బతింటుంది. ఇంట్లో గొడవలు పెరుగుతాయి.

ఒక్క గుర్రం ఉండే పోస్టర్ ఇంట్లో అసలు పెట్టుకోద్దు..కనీసం రెండు గుర్రాలైనా ఉండాలి..

రథాన్ని లాగుతున్న గుర్రం ఫోటోలు కూడా పెట్ట కూడదు..యుద్ధ భూమిలో పోరాటంలో ఉన్న గుర్రం చిత్రం కూడా ఇంట్లో పెట్టుకోవడానికి పనికి రాదు.
ఇలాంటి గుర్రాల ఫోటోలు ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. దారిద్య్రానికి కారణమవుతాయి..