Bathukamma 2023 : బతుకమ్మ పండుగ వెనుక ఆసక్తికర కథలు..

బతుకమ్మ పండుగ పుట్టుక వెనుక ఎన్నో ఆసక్తికర కథనాలు ఉన్నాయి. తెలంగాణను పాలించిన కాకతీయ చక్రవర్తుల కాలం నాటినుంచీ ఈ బతుకమ్మ అలరారుతోంది.

Bathukamma 2023 : బతుకమ్మ పండుగ వెనుక ఆసక్తికర కథలు..

Bathukamma 2023 : బతుకమ్మ పండుగ అంటే ఆడబిడ్డలకు ఆనందం, ప్రకృతితో మమేకమయ్యే అద్భుతమైన పండుగ. ఆరోగ్యప్రదాయినీ. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ బతుకమ్మ పండుగ వెనుక చాలా రకాల కథలున్నాయి. ఎవరి ఎన్ని రకాలుగా చెప్పుకున్నా..బతుకమ్మ అంటూ బతకమని చెప్పటం..సుఖంగా..సంతోషంగా బతకమని ఆశీర్వదించటం. కథలంటే ఏదో కాకమ్మ కథలు కాదు..పువ్వులనే బతుకుగా భావించి వచ్చిన కథలు. చరిత్రకు అద్దంపట్టే కథలు. చరిత్ర ఎప్పుడు ఓ ఘనతే. అటువంటి ఘనతలోంచి పుట్టిన ఎన్నో సందర్భాలు..ఆనాటి పరిస్థితులను కథలుగా మలచిన గాధలు..

జానపదుల పండుగగా మొదలై ఆడబిడ్డల జీవితాల్లో మమేకమైన బతుకమ్మ
బతుకమ్మ పండుగ జానపదుల పండుగగా ప్రారంభమైంది. ఆ తరువాత అది గ్రామాలకు, ఆ తరువాత నగరాలకు వచ్చిందని చెబుతారు. అది దేశ సరిహద్దులు దాటింది. విదేశాలకు పాకింది. తెలంగణ ఆడబిడ్డలు ఏ దేశంలో ఉన్నా బతుకమ్మ పండుగను చేసుకోవటం మాత్రం మానరు. ఎందుకంటే వారి జీవితాల్లో బతుకమ్మ అంతగా మమేకమైపోయింది. బతుకమ్మ అంటే ఆడబిడ్డ..అందుకే ప్రతీ ఇంటి బిడ్డగా బతుకమ్మను భావిస్తారు. బతుకమ్మ పండుగ అంటే ఆటలు, పాటలు,ఆ పాటల్లో ఎన్నో అర్థాలుంటాయి. వాస్తవాలు పాటల రూపంలో వినిపిస్తాయి. బతుకమ్మకు పూజ చేయటమే కాదు ఆడబిడ్డలకు తమ బాధల్నీ..సంతోషాలను పాట రూపంలో బతుకమ్మకు చెప్పుకుంటారు. ఒక తల్లికి చెప్పుకున్నట్లే అన్నీ చెప్పుకుంటారు.

బతుకమ్మ పండుగ వెనుక ఆసక్తికర కథలు..
బతుకమ్మ పండుగ పుట్టుక వెనుక ఎన్నో ఆసక్తికర కథనాలు ఉన్నాయి. తెలంగాణను పాలించిన కాకతీయ చక్రవర్తుల కాలం నాటినుంచీ ఈ బతుకమ్మ అలరారుతోంది.అంటే 12వ శతాబ్ది నుంచి ఈ పండుగ ఉన్నట్లు ఆధారాలున్నాయి. పూవులను బతుకుగా భావించిన స్త్రీలు ఆడే ఆటగా బొడ్డెను గౌరమ్మగా పూజించారు. అలా అదికాస్తా బతుకమ్మగా మారిందనే కొన్ని కథలు చెబుతున్నాయి. ఈ బతుకమ్మ పండుగ వెనుక ఉన్న రకరకాల కథల్ని చెప్పుకుందాం..బతుకమ్మ పండుగలో దాగిన విశేషాలను తెలుసుకుందాం..

కాకతీయ రాణి, వీర నారీమణి చేసిన బతుకమ్మ పండుగ
రుద్రమదేవి తన మనవళ్లకు అనారోగ్యం కలిగినప్పుడు బతుకమ్మ పండుగ చేసిందనీ..తమ వంశాన్ని కాపాడమని బతుకమ్మ ఆడిందనీ చెబుతుంటారు. అలా దాదాపు వెయ్యేళ్లుగా సజీవంగా కొనసాగుతున్న ఈ బతుకమ్మ నేడు అంగరంగ వైభోగంగా పూజలందుకుంటోంది. అది ప్రజాపండుగగా మారింది.

బతుకు అమ్మా..అని దీవించే పండుగ
ఓ దంపతులకు పిల్లలు పుట్టినట్లే పుట్టి చనిపోతున్నారు. దీంతో బిడ్డల కోసం పార్వతీ దేవిని ప్రార్థించారు. ఆమె కరుణతో వారికి ఓ ఆడబిడ్డ పుట్టింది. ఆమెను వారు బతుకు అమ్మా అని ఆశీర్వదించి ఆమెకు బతుకమ్మ అని పేరు పెట్టారు. అలా ఎంతోమంది పిల్లలు పుట్టి చనిపోగా..బతుకు అమ్మా అని ఆశీర్వదించటంతో ఆమె బతికింది కాబట్టి ఆమెకు బతుకమ్మ అని పేరు పెట్టారట.

పురాణ కథల్లో బతుకమ్మ
మహిషాసురుడు లోకాన్ని పట్టి పీడిస్తుంటే మహిషుడ్ని చంపి తమకు మాన..ప్రాణ కల్పించమని వేడుకుంటూ..మహిళలు చేసే ఆరాధనే బతుకమ్మ అని కొందరి అభిప్రాయం. మరో కథగా..గంగాగౌరీ సంవాదంలో భాగంగా శివుడు తలపై పెట్టుకున్న గంగను చూసి పార్వతి అసూయచెంది గంగమ్మనే అందరూ పూజిస్తున్నారు..అంటూ తల్లితో చెబుతుంది. అప్పుడు తల్లి పార్వతిని ఓదార్చి గంగమ్మ మీద నిన్ను పూల తెప్పలా తేలించి పూజించేలా చేస్తానని మాట ఇచ్చిదంట. అదే పూల బతుకమ్మగా మారిందని కొన్ని పురాణ కథలు చెబుతున్నాయి.

అక్కెమ్మ కథ బతుకమ్మ
అక్కెమ్మ అనే యువతికి ఏడుగురు అన్నలున్నారు. అక్కెమ్మను ఎంతో గారాబంగా చూసుకునేవారు. అది అక్కెమ్మ పెద్ద వదిన ఓర్చుకోలేపోయేది. అన్నలు పొరుగూరికి పనిమీద వెళ్లారు. ఇదే అదనుగా భావించిన వదిన అక్కెమ్మకు పాలలో విషం కల్పి ఇచ్చింది. ఆపాలు తాగి అక్కెమ్మ చనిపోతే ఆమెను ఊరి బైట ఉన్న అడవిలో పాతి పెట్టింది. పాతి పెట్టిన మట్టిపై ఓ చెట్టు మొలిచింది. అది చక్కగా విరగబూసింది. ఊరికి వెళ్ళి వచ్చిన అన్నలు..దారిలో ఆ చెట్టును చూశారు. పసుపు పచ్చటి పూలు వారికి ముచ్చటగొలిపాయి. ముద్దుల చెల్లెలు అక్కెమ్మకు ఆ పూలు ఇద్దామని తెంపబోయారు. అప్పుడు అక్కెమ్మ ఆత్మ వారితో తన మరణం గురించి చెబుతుంది. ముద్దుల చెల్లెలు మరణంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. నిన్ను కాపాడుకోలేకపోయాం..ఏం కావాలో కోరుకో చెల్లెమ్మా అన్నారు. అప్పుడు అక్కెమ్మ తంగెడు పూలల్లో నన్ను చూసుకొమ్మని..ప్రతీ ఏటా తన పూలతో పండుగ చేయమని చెప్పిందట. అలా బతుకమ్మ వచ్చిందనీ మరో కథ ప్రాచుర్యంలో ఉంది.


మహిమల బతుకమ్మ
పూర్వం పిల్లలు లేని దంపతులు ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శిస్తుండగా వారికి ఓ ప్రాంతంలో ఓ ఆడబిడ్డ దొరికింది. అమ్మవారే తమకు ఇచ్చిందనే ఆనందంతో ఆ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తారు. ఆమె పెరుగతూ..ఎన్నో మహిమలు చూపేదట. దీంతో ఆమెను ఓ దేవతగా కొలిచేవారు చుట్టుపక్కలవారు. ఆమెనే బతుకమ్మ అని ఓ కథ చెబుతోంది.

ఆడబిడ్డ కోసం ఆరాటపడి రాజు..
మరో కథ కూడా ఉంది.. చోళరాజైన జైన ధర్మాంగదుడు, అతని భార్య సత్యవతికి వంద మంది కొడుకులు. వారందరూ యుద్దంలో చనిపోయారు. లక్ష్మిదేవిని పూజించారు. తమకు పుట్టిన కుమారులంతా చనిపోయారు. ఓ ఆడబిడ్డను ప్రసాదించమని కోరారట.అలా వారికి ఓ ఆడబిడ్డ పుట్టింది. ఆమెను సమస్త మునులు రాజు ఇంటికి వచ్చి చిరకాలం బతుకమ్మా.. అని ఆశీర్వదించారనీ అలా బతికిన ఆమె కథే బతుకమ్మగా ఏర్పడిందని కూడా చెబుతారు. ఆడబిడ్డ అంబటే లక్ష్మీదేవికగా భావిస్తుంటారు. అలా ఆమెను రోజు పూలతో అలకరించి మురిసిపోయేవారనీ అదే పూలతో అలంకరించి చేసుకునే బతుకమ్మ పండుగగా మారిందని చెబుతుంటారు.