Narreddy Sunil Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు మాజీ సీఎం జగన్ సన్నిహితుడు..
గతంలో సునీల్‌రెడ్డి నివాసంలో కీలక డాక్యుమెంట్లు సీజ్ చేశారు అధికారులు.
Narreddy Sunil Reddy: ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్‌రెడ్డిని సిట్ ప్రశ్నిస్తోంది. విజయవాడ సిట్ కార్యాలయంలో సునీల్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. గతంలో సునీల్‌రెడ్డి నివాసంలో కీలక డాక్యుమెంట్లు సీజ్ చేశారు అధికారులు.
వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వం నియమించిన సిట్ విచారణ చేస్తోంది. సునీల్ రెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడు. క్లోజ్ ఫ్రెండ్. మద్యం స్కామ్ కేసులో విచారణకు రావాలని సిట్ అధికారులు సునీల్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. దీంతో ఇవాళ విజయవాడ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సునీల్ రెడ్డి పలు కంపెనీలకు డైరెక్టర్ గా ఉండటంతో.. ఆయన కంపెనీలు, నివాసంలో గతంలో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటిని పరిశీలించిన తర్వాత విచారణకు రావాలని సునీల్ రెడ్డికి సిట్ అధికారులు 4 రోజుల క్రితం నోటీసులు పంపారు. నోటీసులు అందుకున్న సునీల్ రెడ్డి.. ఇవాళ మధ్యాహ్నం విచారణకు హాజరయ్యారు. సునీల్ రెడ్డి విచారణతో త్వరలోనే మద్యం స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read: సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. కేసును క్లోజ్ చేసిన ఏపీ సీఐడీ
