Sun Burn : ఎండవేడితో తలెత్తే చర్మసమస్యల నివారణకు ఈ గృహ చిట్కాలను అనుసరించకపోవటమే మంచిదా ?

వడదెబ్బనుండి ఉపశమనానికి వెన్న ఒక ప్రభావవంతమైన మార్గంగా చాలా మంది భావిస్తారు. చర్మంపై వెన్నను పూస్తుంటారు. అయితే, ఈ రెమెడీ నిజానికి చర్మం నుండి వేడిని గ్రహిస్తుంది. దీని వల్ల చర్మపు మంటను మరింత తీవ్రతరం చేస్తుంది.

sunburn

Sun Burn : వేసవి కాలంలో సూర్యుని యొక్క హానికరమైన కిరణాల కారణంగా చర్మంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. సూర్యుని ప్రతాపం వల్ల వడదెబ్బ, చర్మంపై పొక్కులు, పొట్టు వంటివి ఏర్పడి చర్మాన్ని దెబ్బతీస్తాయి, అలాగే చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.

సూర్యుని నుండి మీ చర్మాన్ని రక్షించుకోవడానికి టోపీలు,సన్‌స్క్రీన్ ఉపయోగించటం, ఎండ తీవ్రంగా ఉండే సమయంలో ప్రత్యక్ష సూర్యకాంతి నుండి దూరంగా ఉండటం వంటి చర్యలు
తీసుకోవడం చాలా ముఖ్యం.

READ ALSO : Heat Wave : ఎండాకాలం వేసవి తాపాన్ని తట్టుకునేందుకు రోజుకు ఎన్నిసార్లు సాన్నం చేయాలో తెలుసా?

ఎండవేడి కారణంగా చర్మం సమస్యలు తలెత్తిన సందర్భంలో చాలా మంది గృహనివారణ చిట్కాలను అనుసరిస్తుంటారు. అయితే వాస్తవానికి ఈ చిట్కాల వల్ల కొన్ని సందర్భాల్లో సమస్య మరింత జఠిలం అయ్యేందుకు అవకాశం ఉంటుంది.

నివారించాల్సిన సన్‌బర్న్ హోం రెమెడీస్ ;

వెన్న: వడదెబ్బనుండి ఉపశమనానికి వెన్న ఒక ప్రభావవంతమైన మార్గంగా చాలా మంది భావిస్తారు. చర్మంపై వెన్నను పూస్తుంటారు. అయితే, ఈ రెమెడీ నిజానికి చర్మం నుండి వేడిని గ్రహిస్తుంది. దీని వల్ల చర్మపు మంటను మరింత తీవ్రతరం చేస్తుంది.

READ ALSO : Safety Tips : నిప్పులు కురిచే ఎండాకాలం.. వాహనాలతో భద్రం.. ఈ జాగ్రత్తలు పాటిస్తే పేలవు, కాలవు

టూత్‌పేస్ట్: టూత్‌పేస్ట్ చర్మానికి అప్లై చేసినప్పుడు శీతలీకరణ అనుభూతిని అందించినప్పటికీ, ఈ చిట్కా చర్మానికి చికాకు కలిగిస్తుంది. వడదెబ్బ తగిలితే ఇలా చేయటం వల్ల మరింత నష్టాన్ని కలిగిస్తుంది.

నిమ్మరసం: నిమ్మరసం శీతలీకరణ అనుభూతిని అందిస్తుంది. ఇది ఆమ్లగుణం కలిగి ఉంటుంది కాబట్టి చర్మాన్ని సూర్యరశ్మి వల్ల మరింత హాని కలిగేలా చేస్తుంది. దీని వల్ల మరింత నష్టం కలుగుతుంది. అలాగే చర్మపు మంటను మరింత తీవ్రతరం చేస్తుంది.

READ ALSO : Summer Health Care : వేసవి కాలం వచ్చేసింది.. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరమే!

వెనిగర్: వడదెబ్బకు గురైనప్పుడు వెనిగర్ అద్భుతాలు చేస్తుందని కొందమంది నమ్ముతారు. అయితే వెనిగర్ చర్మానికి చికాకు కలిగిస్తుంది. వడదెబ్బను మరింత తీవ్రతరం చేస్తుంది. వడదెబ్బకు ఉపశమనం కలిగించడానికి మాయిశ్చరైజర్ లేదా కలబందను ఉపయోగించడం ఉత్తమం. వెనిగర్‌ను ఉపయోగించాలని అనుకుంటే చర్మానికి అప్లై చేసే ముందు దానిని నీటితో శుబ్రపర్చుకోండి. అయితే వడదెబ్బకు ఈ ఇంటి చిట్కాను నివారించడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

ఫ్రూట్ జ్యూస్: సన్‌బర్న్‌కు పండ్ల రసాన్ని పూయడం వల్ల నొప్పి తగ్గుతుందని కొందరు నమ్ముతారు, అయితే ఇది మరింత చికాకు కలిగిస్తుంది.

READ ALSO : Summer Safety For Children : వేసవి కాలంలో మీ పిల్లలు జాగ్రత్త !

తేనె: తేనెకున్న వైద్య లక్షణాల కారణంగా చాలా మంది దానిని సిఫార్సు చేస్తుంటారు. అయితే దీనివల్ల కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు కలిగే ప్రమాదం ఉంటుంది. తేనె వడదెబ్బకు నివారణగా పనిచేస్తుంది. కాకపోతే దీనిని సరైన రీతిలో ఉపయోగించకపోతే ఇబ్బందులు తెచ్చిపెడుతుంది.

బేకింగ్ సోడా: బేకింగ్ సోడా చర్మ చికాకుల నుండి ఉపశమనానికి ఉపయోగించవచ్చు, అయితే సూర్యరశ్మి కారణంగా కాలిపోయిన చర్మానికి ఉపయోగించటం వల్ల చర్మానికి మరింత చికాకు, అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

READ ALSO : వేసవిలో ఈ ఆహారాల విషయంలో జాగ్రత్తలు ఆరోగ్యానికి మంచిది!

ఇక చివరిగా వడదెబ్బ విషయానికి వస్తే వెన్న, టూత్‌పేస్ట్, నిమ్మరసం, వెనిగర్, పండ్ల రసం, తేనె, బేకింగ్ సోడా, కలబందలతో చేసే కొన్ని గృహ నివారణ చిట్కాల వల్ల పరిస్ధితి మరింత దిగజారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వడదెబ్బకు చికిత్స చేసేటప్పుడు ఈ చిట్కాలను పాటించకపోవటమే మంచిది.