Summer Health Care : వేసవి కాలం వచ్చేసింది.. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరమే!

ఎండలో ప్రయాణించే వారు గొడుగు, హెల్మెట్, గ్లౌజ్‌లు వాడాలి. రోజుకు కనీసం నాలుగు లీటర్ల మంచినీరు తప్పక తీసుకోవాలి. తీసుకునే ఆహారంలో తగినంత ఉప్పు, నీరు, పోషక విలువలు ఉండేవిధంగా చూసుకోవాలి.

Summer Health Care : వేసవి కాలం వచ్చేసింది.. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరమే!

Summer is here.. health care is necessary!

Summer Health Care : ఎండలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు శరీర ఆరోగ్యపై తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో వేసవిలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వేసవి ఆహారంపై శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది.

వేసవి వేడికి శరీరంలోని నీరు బయటకు వెళ్లిపోతుంది. దీంతో నీరసం వస్తుంది. దీన్ని అధిగమించాలంటే ఎక్కవగా ద్రవాహారం తీసుకోవాలి. విటమిన్లు సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. ఏదిపడితే అది తినటం మానుకోవాలి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలను ఈ సమయంలో తీసుకోకుండా ఉండటమే ఉత్తమం.

ఎండ వేడికి చిన్న పిల్లలు, ముసలి వారు తట్టుకోలేరు. వారికి ఎండదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఈ వేసవి నుంచి ఉపశమనం పొందాలంటే తగిన జాగ్రత్తలు పాటించాలి.

వేసవిలో పాటించాల్సిన జాగ్రత్తలు ;

వేసవిలో ఆయిల్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. ఇంటి వంటలలో కూడా నూనె వాడకం తగ్గించాలి. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. మసాలా కూరలు తగ్గించాలి. ఉదయం పుట అల్పాహారంగా నూనె తో చేసిన వంటలు కాకుండా ఆవిరి కుడుములు, ఇడ్లీ వంటి వాటిని తీసుకోవటం మంచిది.

కాఫీ, టీ లకు దూరంగా ఉండాలి. వాటి స్థానంలో రాగి జావ తాగాలి. దీని వల్ల ఇమ్యునిటి పవర్ పెరుగుతుంది. కర్భుజా, పుచ్చకాయలు, ఈత కాయలు, తాటి ముంజులు వంటి సీజనల్ పండ్లను తీసుకోవాలి. కూల్ డ్రింకులు బదులుగా కొబ్బరి నీరు తాగాలి.

మజ్జిగ అన్నంలో మామిడి పండ్లను కలిపి తినడం వల్ల విటమిన్ ఏ, డి శరీరానికి అధిక మోతాదులో అందుతాయి. పలచని మజ్జిగలో నిమ్మ రసం, ఉప్పు కలిపి పిల్లలు, పెద్దలు అందరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.

ఏసిలు, కూలర్లు వాడే కన్నా ఇలాంటి తెరలను వాడటం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. కిటికీలకు, గుమ్మాలకు వట్టి వేర్ల తెరలను తడిపి కట్టుకుంటే వేడిని ఇంట్లోకి రానీయకుండా చల్లగా ఉంచుతుంది. ఇంట్లో వాతావరణం చల్లగా ఉండే విధంగా చూసుకోవాలి. ముఖ్యంగా పసి పిల్లలపై ఎండ ప్రభావం పడకుండా చూసుకోవాలి.

ఎండలో ప్రయాణించే వారు గొడుగు, హెల్మెట్, గ్లౌజ్‌లు వాడాలి. రోజుకు కనీసం నాలుగు లీటర్ల మంచినీరు తప్పక తీసుకోవాలి. తీసుకునే ఆహారంలో తగినంత ఉప్పు, నీరు, పోషక విలువలు ఉండేవిధంగా చూసుకోవాలి. ఎండలో బయటికి వెళ్లే సమయంలో కళ్లద్దాలు సన్‌వూస్కీన్‌లోషన్లు వాడాలి.

బయటకి వెళ్ళాలంటే సరైన సమయాలు ఎంచుకోవాలి. ఆటలు, ఈత నేర్పించాలంటే తెల్లవారుజామునే వెళ్లి ఎండ ముదరక ముందే ఇంటికి చేరుకోవాలి. చర్మం పై తేమ ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం వాటర్ కలిసిన మాయిశ్చరైజింగ్ క్రీమును, రోజ్ వాటర్‌ను రాసుకుంటే మంచిది. చర్మం మీద సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల పడకుండా చూసుకోవాలి.