కిడ్నీలు మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలు. అవి శరీరానికి ఫిల్టర్ లా పనిచేస్తాయి. రక్తంలో ఉన్న వ్యర్థపదార్థాలను శుద్ది చేయడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇలాంటి కిడ్నీలను జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనదే.
కిడ్నీ బాగుందా.. లేదా అని తెలుసుకోవడానికి ఏఏ పరీక్షలు చేయించుకోవాలి..ఏ వయస్సు వారు చేయించుకోవాలో చాలా మందికి తెలియదు. కిడ్నీ సంబంధిత వ్యాధులు చాలా వేగంగా పెరిగిపోతున్నాయి. అయితే కిడ్నీ పాడవుతుందని తెలిపే లక్షణాలు బయటికి కనిపించవు. మనంతటమనం కిడ్నీ ఎలా ఉందో తెలుసుకునేందుకు అవసరమయ్యే పరీక్షలను చేయించుకుంటేనే కిడ్నీ ఎలా ఉందో తెలుస్తుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
> 7 నుంచి 8 గ్లాసుల నీటిని కచ్చితంగా తాగాలి.
> ఎరుపు రంగులో ఉండే క్యాప్సికంను ఎక్కువగా తినాలి. వీటిల్లో ఉండే విటమిన్ ఎ, సి, పొటాషియం తదితర పోషకాలు కిడ్నీల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి.
> నిత్యం వెల్లుల్లిని ఏదో ఒక రూపంలో తీసుకుంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. దీని వల్ల శరీరంలో ఉండే విష పదార్థాలు కూడా బయటకు వెళ్లిపోతాయి.
> బెర్రీలలో ఫైబర్, విటమిన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే మలినాలను బయటికి పంపి కిడ్నీలను ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి
> ఓట్స్, కాలిఫ్లవర్, ఉల్లిపాయలు, పైనాపిల్స్ కూడా కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. కిడ్నీ వ్యాధులు రాకుండా చూస్తాయి. వీటిని రోజూ తింటుంటే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.