Krithi Sanon : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి దేశమంతటా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ కి అమ్మాయిల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువే. ప్రభాస్ ఓకే అంటే పెళ్లి చేసుకోవడానికి చాలా మంది అమ్మాయిలు వెయిట్ చేస్తుంటారు. కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి చేసుకోకుండా ఇంకా సింగిల్ జీవితమే గడిపిస్తూ సినిమాలతో బిజీగా ఉంటున్నాడు.
తాజాగా ఓ బాలీవుడ్ భామ ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. అయితే నిజంగానే కాదండోయ్. సరదాగా చెప్పింది. హీరోయిన్ కృతి సనన్ ఇటీవలే భేడియా సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా తెలుగులో తోడేలు పేరుతో రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కృతి సనన్ బాలీవుడ్, టాలీవుడ్ లో పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది.
Rajamouli : అమెరికా న్యూస్ పేపర్లో రాజమౌళిపై స్పెషల్ ఆర్టికల్.. హాలీవుడ్ లో అదరగొడుతున్న టాలీవుడ్..
ఓ ఇంటర్వ్యూలో యాంకర్ కృతి సనన్‌కి కార్తీక్ ఆర్యన్, టైగర్ ష్రాఫ్, ప్రభాస్.. ముగ్గురు హీరోలను ఆప్షన్‌గా ఇచ్చి వీళ్ళల్లో ఎవరిని పెళ్లి చేసుకుంటావు, ఎవరితో డేటింగ్ చేస్తావు, ఎవరిని ఫ్లర్ట్ చేస్తావు అని అడిగారు. దీంతో కృతి సమాధానమిస్తూ కార్తీక్ ఆర్యన్‌ను ఫ్లర్ చేస్తానని, టైగర్ ష్రాప్‌తో డేట్‌కి వెళతానని, ప్రభాస్‌ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటాను అని కృతి ఇలా అనడంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇక ప్రభాస్, కృతి సనన్ కలిసి ఆదిపురుష్ సినిమాలో నటించారు. అప్పట్నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది.