Rajamouli : అమెరికా న్యూస్ పేపర్‌లో రాజమౌళిపై స్పెషల్ ఆర్టికల్.. హాలీవుడ్ లో అదరగొడుతున్న టాలీవుడ్..

జమౌళికి హాలీవుడ్ లో గొప్ప ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా రాజమౌళికి మరో అరుదైన గౌరవం లభించింది. అమెరికాలో ఎక్కువ సర్కులేషన్ ఉన్న పేపర్స్ లో ఒకటైన లాస్ ఏంజిల్స్ టైమ్స్ పత్రికలో రాజమౌళిపై.............

Rajamouli : అమెరికా న్యూస్ పేపర్‌లో రాజమౌళిపై స్పెషల్ ఆర్టికల్.. హాలీవుడ్ లో అదరగొడుతున్న టాలీవుడ్..

rajamouli on the front page of Los Angeles Times

Rajamouli :  RRR సినిమా అనంతరం రాజమౌళి మరింత పాపులర్ అయ్యారు. ముఖ్యంగా రాజమౌళి టేకింగ్ కి టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా అందరూ ఫిదా అయిపోయారు. ఇక రాజమౌళి గత రెండు నెలలుగా అమెరికాలోనే ఉంటూ RRR సినిమాని మరింత ప్రమోట్ చేస్తూ అక్కడి ఫిలిం ఫెస్టివల్స్ లో పాల్గొంటున్నాడు. అక్కడి మీడియాతో, ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవుతున్నాడు జక్కన్న.

హాలీవుడ్ లో కూడా చాలా మంది ప్రముఖులు ఇప్పటికే రాజమౌళిని పొగుడుతూ ట్వీట్స్ చేశారు. కొంతమంది డైరెక్ట్ గా కలిసి అభినందిస్తున్నారు. రాజమౌళికి హాలీవుడ్ లో గొప్ప ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా రాజమౌళికి మరో అరుదైన గౌరవం లభించింది. అమెరికాలో ఎక్కువ సర్కులేషన్ ఉన్న పేపర్స్ లో ఒకటైన లాస్ ఏంజిల్స్ టైమ్స్ పత్రికలో రాజమౌళిపై స్పెషల్ ఆర్టికల్ రాశారు. ఒక పేజీ మొత్తం రాజమౌళి కోసం కేటాయించారు. హాఫ్ పేజీలో రాజమౌళి ఫోటో పెద్దగా వేసి RRR డైరెక్టర్ రాజమౌళి, హాలీవుడ్ లో టాలీవుడ్ సంచలనం అంటూ స్పెషల్ ఆర్టికల్ రాశారు. ఈ ఆర్టికల్ లో RRR సినిమాని, రాజమౌళిని ప్రశంసించారు.

Varisu : దిల్ రాజుకి మరో షాక్.. వారసుడు సినిమాకి నోటిసులిచ్చిన యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా

దీంతో టాలీవుడ్ ప్రేక్షకులు, రాజమౌళి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక తెలుగు సినిమా పర్సన్ కి లాస్ ఏంజిల్స్ టైమ్స్ పత్రికలో ఒక ఫుల్ ఆర్టికల్ రాయడం అంటే మాములు విషయం కాదు, ఇది చాలా పెద్ద అచివ్మెంట్ అని అందరూ రాజమౌళిని మరోసారి ప్రశంసిస్తున్నారు.