Long Working Hours : కొవిడ్-19 ఎఫెక్ట్ : ఎక్కువ గంటలు పనిచేసేవారు ఏడాదికి లక్షలాది మంది చనిపోతున్నారు

COVID-19 మహమ్మారి కారణంగా ఉద్యోగుల పనివిధానంలో చాలామార్పులు వచ్చాయి. ఉద్యోగుల్లో చాలామంది ఇంటి నుంచే పనిచేస్తుంటే.. మరికొంతమంది ఆఫీసుల్లో ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు.

Long working hours are a killer : COVID-19 మహమ్మారి కారణంగా ఉద్యోగుల పనివిధానంలో చాలామార్పులు వచ్చాయి. ఉద్యోగుల్లో చాలామంది ఇంటి నుంచే పనిచేస్తుంటే.. మరికొంతమంది ఆఫీసుల్లో ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఎక్కువ గంటల పనివిధానం.. ఏడాదికి లక్షలాది మందిని చంపుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. ఎక్కువ పని గంటలతో పనిచేసేవారిలో అనారోగ్య సమస్యలు అధికంగా ఓ అధ్యయనంలో తేలింది.

ఎక్కువ గంటల పనివిధానంతో 745,000 మంది గుండె జబ్బులతో మరణించినట్లు తేలింది. 2000 నుంచి దాదాపు 30శాతం మరణాలు పెరిగినట్టు గుర్తించారు. అంటే వారానికి 55 గంటలు లేదా అంతకంటే ఎక్కువ పని చేయడం తీవ్రమైన ఆరోగ్య ప్రమాదని WHO ఆరోగ్య శాఖ డైరెక్టర్ మరియా నీరా హెచ్చరిస్తున్నారు. WHO అంతర్జాతీయ కార్మిక సంస్థ ఉమ్మడి అధ్యయనంలో చాలా మంది బాధితులు (72శాతం) పురుషులు, మధ్య వయస్కులు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గలవారే ఉన్నారని తేలింది.

ఆగ్నేయాసియా, పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు- చైనా, జపాన్ ఆస్ట్రేలియాలో WHO అధ్యయనం చేయగా.. ఇక్కడి ఉద్యోగుల్లోనే ఎక్కువగా ప్రభావితమైనట్టు తేలింది. మొత్తంమీద 194 దేశాల డేటాలో వారానికి 55 గంటలు లేదా అంతకంటే ఎక్కువ పని చేసేవారు 35శాతం అధికంగా గుండెపోటుతో మరణించారు. 35-40 గంటలతో పోలిస్తే.. ఇస్కీమిక్ గుండె జబ్బులతో చనిపోయే వారు 17శాతం ఎక్కువ సంబంధం కలిగి ఉన్నారని తెలిపారు. కనీసం 9శాతం మంది ఎక్కువ గంటలు పని చేస్తారని అంచనా వేసింది. కరోనావైరస్ అత్యవసర పరిస్థితుల్లో ప్రపంచ ఆర్థిక మందగమనం వల్ల ప్రమాదాలు పెరిగాయని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు