Nasal Covid Vaccine : ముక్కు ద్వారా కరోనా టీకా.. సింగిల్ డోస్ ఇస్తే చాలు..!

ముక్కు ద్వారా వేసే కరోనా టీకా వస్తోంది.. ఈ టీకా సింగిల్ డోస్ వేస్తే చాలంట.. కరోనా వ్యాప్తిని పూర్తిగా కంట్రోల్ చేస్తుందంట.. ఈ నాజల్ కొవిడ్ వ్యాక్సిన్ జంతువుల్లో సమర్థవంతంగా పనిచేస్తుందని రీసెర్చ్‌లో తేలింది.

Nasal Covid Vaccine Prevents Disease, Transmission In Animals

Nasal Covid Vaccine : ముక్కు ద్వారా వేసే కరోనా టీకా వస్తోంది.. ఈ టీకా సింగిల్ డోస్ వేస్తే చాలంట.. కరోనా వ్యాప్తిని పూర్తిగా కంట్రోల్ చేస్తుందంట.. ఈ నాజల్ కొవిడ్ వ్యాక్సిన్ జంతువుల్లో సమర్థవంతంగా పనిచేస్తుందని రీసెర్చ్‌లో తేలింది. SARS-CoV-2 virus వ్యాప్తి చేసే వైరస్ నియంత్రణకు నాజల్ కొవిడ్ వ్యాక్సిన్ (intranasal COVID-19 vaccine) ఒక సింగిల్ డోసు ఇస్తే చాలంటున్నారు పరిశోధకులు.

అమెరికాలోని జార్జియా యూనివర్శిటీ సైంటిస్టులు ఈ అధ్యయనాన్ని నిర్వహించగా.. జనరల్ స్సైన్స్ అడ్వాన్సెస్ లో ప్రచురించారు. influenza (ఇన్ ఫ్లూయింజా) వంటి టీకాల మాదిరిగానే ఈ టీకా కూడా నాజల్ స్ప్రే (Nasal Spray) ద్వారా తీసుకోవచ్చునని పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ సింగిల్ డోస్ నాజల్ వ్యాక్సిన్ సాధారణ రిఫ్రిజేటర్ ఉష్ణోగ్రతలో కనీసం మూడు నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు.

‘ప్రస్తుత కరోనా టీకాలు బాగా పనిచేస్తున్నాయని, ప్రపంచ జనాభాలో అధికశాతం మంది ఇంకా వ్యాక్సిన్‌ అందుకోలేదని అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ జనాభాకు కరోనా టీకాల అవసరం ఎంతైనా ఉందన్నారు. టీకా వేసేటప్పుడు ఎలాంటి నొప్పిలేకుండా సులభంగా ఉండేలా ఈ నాజల్ స్ప్రే వ్యాక్సిన్ తీసుకురావాలని భావిస్తున్నారు. అంతేకాదు.. కరోనా వ్యాప్తిని కూడా సమర్థంగా నిరోధించేదిగా ఉండాలని పరిశోధన శాస్త్రవేత్త పాల్‌ మెక్‌ క్రే (McCray) వెల్లడించారు.

ప్రయోగాత్మక టీకాలో parainfluenza virus 5 (PIV5)ను ఉపయోగించారు. అందులోకి కరోనా వైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌ (SARS-CoV-2 spike protein)ను ప్రవేశపెట్టారు. కొవిడ్‌ నుంచి రక్షించేలా రోగ నిరోధక వ్యవస్థలో ప్రతిస్పందనలను కలిగించినట్టు గుర్తించారు. PIV5 అనేది సాధారణ జలుబు వైరస్‌. మానవులు, ఇతర క్షీరదాల్లో స్వల్ప ఇన్‌ఫెక్షన్‌ వ్యాపిస్తుంది.