ప్రపంచ దేశాలన్ని కరోనా వైరస్ తో వణికిపోతున్నాయి. ఈ మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ లాక్ డౌన్ తో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరు హోం క్వారంటైన్ నిర్భందంలోకి వెళ్లిపోయారు. ఈ నేపధ్యంలో ప్రజలు కాస్తా వినోదాన్ని వెతుకుంటున్నారు. అందులో భాగంగానే ‘#QuarantinePillowChallenge’ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బెంగాళీ టీవి నటీ దెబీనా బెనర్జీ పిల్లో ఛాలెంజ్‌ను ప్రారంభించింది. ఈ పిల్లో ఛాలెంజ్‌ను తన అభిమానులకు విసిరింది దెబీనా. ఇప్పుడీ పిల్లో ఛాలెంజ్ అందరిని ఆకట్టుకుంటోంది. ఈ ఛాలెంజ్ తో చాలామంది అభిమానులు ఆమెను ఫాలో అవుతున్నారు. అంతేకాకుండా వారు కూడా ఈ ఛాలెంజ్ విసురుతూ ఆనందాన్ని పొందుతున్నారు. ఇంతకీ ఈ పిల్లో ఛాలెంజ్ అంటే ఏంటంటే?
మనం నిద్రపోయే సమయంలో తల కింద పెట్టుకునే పిల్లో (దిండు)ను డ్రెస్గా వేసుకుని ఫోటోలు దిగాలన్నమాట. ఇప్పటికే చాలామంది అమ్మాయిలు పిల్లోకి బెల్ట్ పెట్టి ఒక డ్రెస్ లాగా వేసుకుని ఫోటోలు దిగుతున్నారు. రకరకాల ఫోజ్‌లు ఇస్తూ వాటి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తున్నారు. దాంతో ఆ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఛాలెంజ్ అనేది ఒక అమ్మాయిలకు మాత్రమే అని భావించవచ్చు. కానీ కొంత మంది మగవాళ్లు, పెంపుడు జంతువులు కూడా ఈ ఛాలెంజ్ ని స్వీకరించి దిగిన కొన్ని ఫోటోలను మనం చూడవచ్చు. ఇలా ‘#QuarantinePillowChallenge’ ఒకరు మరొకరికి విసురుతూ నెటిజన్లకు ఆనందాన్ని అందిస్తున్నారు.