NIT Patna Recruitment
NIT Recruitment : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. బిహార్ పట్నాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్‌లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఎంసీక్యూ టెస్ట్, డిస్క్రిప్టివ్, షార్ట్ ఆన్సర్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 9,300 నుంచి రూ. 34,800 వరకు చెల్లిస్తారు.
READ ALSO : Good Benefits From Fruits : పండ్లు వల్ల మంచి ప్రయోజనాలు పొందాలంటే తినేటప్పుడు పాటించాల్సిన 3 నియమాలు !
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 200, ఇతరులు రూ. 400 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు 18 మే 2023 చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.nitp.ac.in/ పరిశీలించగలరు.