Good Benefits From Fruits : పండ్లు వల్ల మంచి ప్రయోజనాలు పొందాలంటే తినేటప్పుడు పాటించాల్సిన 3 నియమాలు !

కేవలం పండ్లు తినడం గురించి కాదు, పండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పెంచుకోవడానికి కొన్ని నియమాలను పాటించాలి. ఆహారాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నా లేదా కొన్ని ఆరోగ్యకరమైన మార్పులు చేయాలని చూస్తున్నా, ఈ నియమాలు పండ్లను ఎక్కువగా తీసుకోవడంలో సహాయపడతాయి.

Good Benefits From Fruits : పండ్లు వల్ల మంచి ప్రయోజనాలు పొందాలంటే తినేటప్పుడు పాటించాల్సిన 3 నియమాలు !

good benefits from fruits

Good Benefits From Fruits : రోజువారీ ఆహారంలో పండ్లను చేర్చుకోవడం ఆరోగ్యకరమైన జీవనశైలికి ఎంతో ముఖ్యం. పండ్లు సహజసిద్ధమైనవి. సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్‌లను సమృద్ధిగా ఉంటాయి, శరీరానికి అవసరమైన శక్తిని , రోగనిరోధక శక్తిని అందించడానికి పోషకాలు దోహదపడతాయి. అవి వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలు, ఎంజైమ్‌లను కలిగి ఉంటాయి, ఒక్కొక్కటి దాని స్వంత ప్రత్యేక ప్రయోజనాలను కలిగి ఉంటాయి.

READ ALSO : Sapota Fruits : వేసవి కాలంలో రోజుకు రెండు సపోటా పండ్లు తింటే చాలు…మంచి ఆరోగ్యం మీ సొంతం!

అయితే, ఇది కేవలం పండ్లు తినడం గురించి కాదు, పండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పెంచుకోవడానికి కొన్ని నియమాలను పాటించాలి. ఆహారాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నా లేదా కొన్ని ఆరోగ్యకరమైన మార్పులు చేయాలని చూస్తున్నా, ఈ నియమాలు పండ్లను ఎక్కువగా తీసుకోవడంలో సహాయపడతాయి.

అన్ని పండ్లు వాటి వాటి పోషక గుణాలను అనుసరించి చాలా ఆరోగ్యకరమైనవి. అయితే స్థానికంగా అందుబాటులో ఉండే పండ్లను తినడం మంచిది. దిగుమతి చేసుకున్న పండ్లు ఆరోగ్యంగా ఉండవచ్చని చాలా మంది నమ్ముతారు. అయితే ఈ పండ్లను పక్వానికి రాకముందే పండిస్తారు. తద్వారా వాటి పోషక విలువలు తొలగిపోతాయి. మార్కెట్‌లోకి చేరుకున్న తర్వాత, వాటిని అసహజంగా పండించడానికి రసాయనాలతో స్ప్రే చేస్తారు. దీని నుండి తప్పించుకోవాలంటే స్థానికంగా లభించే పండ్లను తినంటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

READ ALSO : Jamun Fruit : నోరు , చిగుళ్ల సమస్యలను పొగొట్టే నేరేడు పండ్లు !

పండ్లను తినటంద్వారా గరిష్ట ప్రయోజనాలు పొందాలంటే ఉత్తమ మార్గాలు ;

1. పండ్లను మొత్తంగా తీసుకోవటం ; పండ్లను జ్యూస్ రూపంలో చేసుకుని తీసుకోవటం కంటే మొత్తంగా తినండం మంచిది. పండును జ్యూస్ చేసినప్పుడు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఎంజైమ్‌లు తొలగిపోతాయి. పండ్లలోకి ఫ్రక్టోజ్ తోపాటు, అదనంగా చేర్చే చక్కెర స్ధాయిలు కడుపులోకి చేరి యూరిక్ యాసిడ్ స్థాయిలను పెరిగేలా చేస్తాయి. అనేక ఆరోగ్య సమస్యలకు
దారితీస్తుంది.

2. భోజనం తర్వాత పండ్లు తినడం మానేయండి ; భోజనం చేసిన వెంటనే పండ్లను తీసుకుంటే, అది కడుపులోకి వెళ్లి, తిన్న భోజనంతోపాటు ఇతర ఆహారాలతో కలిసి చర్యపొందుతుంది. దీని ఫలితంగా ఎక్కువ ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. దీంతో వాటి ఆరోగ్యకరమైన లక్షణాలను కోల్పోవాల్సి వస్తుంది.

READ ALSO : Fruits And Vegetables In Winter : శీతాకాలంలో పండ్లు, కూరగాయలు ఎందుకు ఎక్కువగా తీసుకోవాలంటే ?

3. పండ్లు తినే ముందు కొన్ని గింజలు తీసుకోండి ; పండ్లు కొవ్వుకు మూలం కాబట్టి వాటి నుండి రక్తంలో చక్కెర పెరుగుదలను సమతుల్యం చేయడంలో గింజలు సహాయపడతాయి. అందువల్ల, పండ్లు తినేముందు బాదం , వాల్ నట్స్ వంటి గింజలను తీసుకోవడం మంచి పని.