ఇంట్లో ఉన్నది చాలు.. రెస్టారెంట్‌లకెళ్లి తినండి.. ఆఫీసుకెళ్లండి… దేశాన్ని రక్షించండని ప్రజలను బుజ్జగిస్తున్నారు!

  • Publish Date - August 15, 2020 / 03:13 PM IST

కరోనాతో సహజీవనం తప్పదు.. ఎన్ని వ్యాక్సిన్లు వచ్చినా కరోనా అంతమవుతుందన్న గ్యారెంటీ లేదు.. ఇక మిగిలింది.. జీవనాన్ని సాగించడమే.. కరోనాకు మునపటిలా అందరూ తమ సహజ జీవనశైలిని కొనసాగించాల్సిందేనని అంటున్నారు బ్రిటన్ పొలిటిషియన్ రిషి సునాక్..

ఇప్పటివరకూ ఇంట్లో ఉన్నది చాలు.. ఇక ఆఫీసులకు వెళ్లండి.. అవసరమైతే రెస్టారెంట్లలో తినండి.. దేశాన్ని రక్షించాలని బ్రిటన్ ప్రజలను ఆయన బుజ్జగిస్తున్నారు. రాజధానిలో ప్రస్తుత కరోనావైరస్ తగ్గుముఖం పట్టడంతో ఛాన్సలర్ లండన్ వాసులను ప్రశంసించారు. ఇకనైనా అందరూ ముందుకు సాగాలని లండన్ పవర్ హౌస్ ఎకానమీని ముందుకు నడిపించాలని ఆయన అన్నారు.



ఆఫీసులకు తిరిగి వెళ్లడం, రెస్టారెంట్లలో భోజనం చేయడం, షాపింగ్ చేయడం ద్వారా దేశంలోని ఆర్థిక వ్యవస్థను కాపాడడంలో యునైటెడ్ కింగ్‌డమ్ పౌరులు తమ వంతు కృషి చేయడం చాలా కీలకమని ఆయన అన్నారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గత వారమే దేశంలో ఉద్యోగస్థులను తిరిగి తమ ఆఫీసులకు రమ్మని వేడుకున్నారు. ఇంట్లో ఉండడం వల్ల ఉద్యోగాలు కోల్పోయి అధిక ఖర్చులతో రుణభారం తప్పదని హెచ్చరించారు.
ఆర్థికపరంగా సమస్యలు అధికమవుతున్నాయి.. ఆఫీసులన్నీ ఖాళీగా ఉంటే, హై-స్ట్రీట్, సిటీ-సెంటర్ షాపుల నుంచి 135,000 ఉద్యోగాలు కోల్పోవచ్చు. లక్షలాది మంది ఇంట్లో ఉంటే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని గృహనిర్మాణ మంత్రి రాబర్ట్ జెన్రిక్ హెచ్చరించారు. మనలో ఉన్నవారు సురక్షితంగా దుకాణాలకు వెళ్లడం, కేఫ్‌లు రెస్టారెంట్లలో భోజనం చేయడం, తిరిగి పనికి రావాలని సూచిస్తున్నారు. లేదంటే మరిన్ని ఉద్యోగ నష్టాలు చవిచూడాల్సి వస్తుందని చెప్పారు. వ్యాపారాల్లో నష్టాన్ని చూడాల్సి వస్తుందని తాను భయపడుతున్నానని జాన్సన్ చెప్పుకొచ్చారు. పాఠశాలలను తెరవడం చాలా ముఖ్యమైనదిగా పేర్కొన్నారు.



కరోనావైరస్ లాక్‌డౌన్ పరిమితులు సడలించడంతో మే నెలలో యూకే ఆర్థిక వ్యవస్థ 1.8 శాతం వృద్ధి చెందిందని రిషి వెల్లడించారు. కానీ రెస్టారెంట్లు, చుట్టుపక్కల వ్యాపారాలను పెంచడానికి ‘ఈట్ అవుట్ టు హెల్ప్ అవుట్’ స్కీమ్ సాయపడుతుందని గణాంకాలు వెల్లడించాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో GDP ఇంకా రికార్డుల నుంచి కోలుకోలేదన్నారు.

ఫిబ్రవరిలో కరోనావైరస్ పూర్వ స్థాయిలతో పోలిస్తే.. ఇప్పటికీ 24.5 శాతం తగ్గిందన్నారు. కరోనావైరస్ లాక్ డౌన్ సమయంలో ఆర్థిక పతనానికి కారణమైనందున మార్చిలో UK ఆర్థిక వ్యవస్థ 5.8 శాతం పడిపోయింది. ఏప్రిల్‌లో జిడిపి 20.4 శాతం పడిపోయింది. ఈ ఏడాది జిడిపి 14.3 శాతం తగ్గుతుందని ఆఫీస్ ఫర్ బడ్జెట్ బాధ్యత (OBR) అంచనా వేసింది.



furlough పథకం ముగియడంతో నిరుద్యోగ స్థాయి 12 శాతానికి చేరుకుంటుందని OBR తెలిపింది. మార్చి నుంచి హై స్ట్రీట్ రిటైలర్లు, తయారీదారులు, విమానయాన సంస్థలు, రెస్టారెంట్ల గొలుసుల వద్ద స్టోర్ మూసివేత కారణంగా దాదాపు 60,000 ఉద్యోగాలు కోల్పోగా వేలాది మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు