Rose Masala Chai : చలికాలంలో శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా చేసే రోజ్ మసాలా చాయ్!

ఉదయాన్నే ఒక కప్పు రోజ్ మసాలా చాయ్ తాగటం వల్ల జీర్ణ ప్రక్రియ వేగవంతంగా మారుతుంది. గులాబీల్లో ఉండే విటమిన్‌ ఎ, సిలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బరువు తగ్గాలనుకునేవారికి చక్కటి పానీయం ఇది.

Rose Masala Chai : చలికాలంలో శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా చేసే రోజ్ మసాలా చాయ్!

Rose masala chai that prevents cholesterol from rising in the body in winter!

Updated On : December 15, 2022 / 10:04 PM IST

Rose Masala Chai : శీతాకాలంలో గజగజ వణికించే చలిలో వేడివేడి టీ తాగాలని చాలా మంది కోరుకుంటారు. చలికాలం అంటే అనేక వ్యాధులు చుట్టుముట్టే కాలం. వీటి నుండి శరీరాన్ని రక్షించుకోవటం అవసరమే. ఈ సమయంలో సాధారణ టీ కంటే శరీర ఆరోగ్యానికి అన్ని విధాలుగా మేలు కలిగించే రోజ్ మసాలా చాయ్ బాగా ఉపకరిస్తుంది. ఈ చాయ్ మంచి మొత్తంలో సుగంధ ద్రవ్యాలు మరియు గులాబీ రేకులతో సమృద్ధిగా ఉంటుంది. మసాలా చాయ్ కంటే చాలా సరళమైనది, చాలా రుచికరమైనది. ఈ టీని ఇష్టపడితే అస్సలు వదిలిపెట్టరు.

ఉదయాన్నే ఒక కప్పు రోజ్ మసాలా చాయ్ తాగటం వల్ల జీర్ణ ప్రక్రియ వేగవంతంగా మారుతుంది. గులాబీల్లో ఉండే విటమిన్‌ ఎ, సిలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బరువు తగ్గాలనుకునేవారికి చక్కటి పానీయం ఇది. శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరగనీయదు. యాంటీ ఆక్సిడెంట్లు అధిక రక్తపోటుకు కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ నియంత్రించబడతాయి. అంతేకాకుండా చలికాలంలో త్వరగా వ్యాప్తి చెందిన ఆరోగ్య పరంగా ఇబ్బంది కలిగించే జలుబు, దగ్గు వంటి వాటిని తగ్గించటంలో ఈ టీ ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ టీల్లో వేసిన పదార్థాల్లో యాంటీ వైరల్‌, యాంటీఫంగల్‌, యాంటీమైక్రోబియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల జలుబు, దగ్గు వంటివి దరిచేరవు. నెలసరి నొప్పులతో బాధపడేవారు ఓ కప్పు రోజ్‌ మసాలా చాయ్‌ ఉపశమనం కలిగిస్తుంది.

రోజ్ మసాల చాయ్ తయారీ విధానం ;

పాలల్లో తేయాకు పొడితో పాటు కొన్ని ఎండు గులాబీ రేకలూ, చెంచా తులసి పొడి, చిటికెడు దాల్చిన చెక్క పొడి, రెండు యాలకుల్ని వేసి బాగా మరిగించాలి. మరిగిన తరువాత వడకట్టిన టీకి కాస్త తేనె కలిపి వేడి వేడిగా తీసుకోవాలి. గజగజ వణికించే చలిలో ఈ టీ తాగటం వల్ల శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. చల్లి నుండి ఒకింత రక్షణ కలిగిస్తుంది. ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.