Sesamum
Sesamum : నువ్వులు శరీరానికి అవసరమైన, ఆరోగ్యాన్ని పెంపొంచే అన్ని రకాల పోషకాలను కలిగి ఉంటాయి. మినరల్స్, కాల్షియం, జింక్, ఐరన్, థయామిన్ మరియు విటమిన్ ‘ఇ’లను కలిగి ఉంటాయి. తెల్ల నువ్వులు, నల్లని నువ్వులు రెండు రకాలుగా బాగా వాడుకలో ఉన్నాయి. నువ్వు గింజల్లో నూనె పదార్థంతోపాటు ప్రొటీన్ కూడా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఆయుర్వేద వైద్యంలోనూ విరివిగా ఉపయోగిస్తారు. నల్ల నువ్వులు రోజు తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు పదార్థాలను బయటకి పంపి మన శరీరానికి నూతన ఉత్తేజాన్ని అందిస్తుంది.
నువ్వుల నూనెలో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన పిండిపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. వీటితో తయారుచేసిన పదార్థాలు ఎక్కువకాలం నిల్వ ఉంటాయి. స్త్రీలలో హార్మోన్ల సమస్యకు నువ్వులు చక్కని పరిష్కారం. నువ్వులను వేయించి వివిధ వంటకాలలో, కూరలలో, పచ్చడిగా వాడతారు. దీనిని నువ్వుల పొడిగా చేసి ఇడ్లీ మొదలైన వాటితో కలిపి తింటారు. నువ్వుల నూనెలో ఉన్న లెసిథిన్ అనే రసాయనం, రక్త నాళాలలో కొలెస్ట్రాల్ ప్రవాహాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. స్వచ్ఛమైన నువ్వుల నూనెను క్రమం తప్పకుండా తీసుకుంటే అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు చాలా తక్కువ.
రక్తహీనత తగ్గేందుకు 100 గ్రాముల నల్ల నువ్వులలో, 100 గ్రాముల బెల్లం కలిపి దంచి ఒక సీసాలో నిల్వ ఉంచుకోవాలి. రాత్రి పడుకునేటప్పుడు కొంచెం తీసుకోవాలి. ఆ తర్వాత 100 మిల్లీ లీటర్ల పాలు లేదంటే, గోరువెచ్చని నీరు త్రాగాలి. ఇలా చేయడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. 100 గ్రాముల తెల్ల నువ్వులలో 1000 మి.గ్రా కాల్షియం లభిస్తుంది. నువ్వులు, బాదం కన్నా 6 రెట్లు ఎక్కువ కాల్షియం కలిగి ఉంటాయి. నువ్వులు, పాలతో పోలిస్తే మూడు రెట్లు కాల్షియం కలిగి ఉంటాయి. నువ్వులలో ఉండే జింక్ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. నువ్వుల నూనెలో భాస్వరం ఉంటుంది, ఇది ఎముకలను బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
నువ్వులల్లో ఉండే మూలాశక్తి వల్ల అల్ట్రావైలెట్ కిరణాల చర్మంపై పాడినప్పుడు ఏర్పడే నల్ల మచ్చలను తొలగిస్తుంది. అలాగే చర్మ సంబంధిత క్యాన్సర్‌ని నల్ల నువ్వలు తగ్గిస్తాయి. నువ్వులు ఫైబర్‌ను కలిగి ఉంటాయి. వీటినే లిగ్నిన్స్ అంటారు. ఈ రకమైన ఫైబర్స్ శరీరాల్లో ఏర్పడే చెడు కొవ్వును పూర్తిగా తొలగిస్తుంది. ప్రతి రోజూ ఉదయం పరగడుపున ఓ టీ స్పూన్ నువ్వులను బెల్లంతో ఆరగించినట్టయితే ఎముకలకు, వెన్నుపూసలకు సంబంధించిన సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.