ఆడాళ్లు ఆగండి : లిప్‌స్టిక్ ఎంత డేంజరో తెలుసుకోండి

ఆడాళ్లకి, లిప్ స్టిక్‌కి విడదీయరాని అనుబంధం ఉంది. లిప్ స్టిక్‌ అంటే వారికి ప్రాణం. కొందరు లేడీస్ లిప్ స్టిక్ లేనిదే ఇంట్లో నుంచి బయటకి అడుగు పెట్టరు. అంతగా లిప్ స్టిక్‌కి అడిక్ట్ అయ్యారు.

  • Publish Date - January 21, 2019 / 10:36 AM IST

ఆడాళ్లకి, లిప్ స్టిక్‌కి విడదీయరాని అనుబంధం ఉంది. లిప్ స్టిక్‌ అంటే వారికి ప్రాణం. కొందరు లేడీస్ లిప్ స్టిక్ లేనిదే ఇంట్లో నుంచి బయటకి అడుగు పెట్టరు. అంతగా లిప్ స్టిక్‌కి అడిక్ట్ అయ్యారు.

ఆడాళ్లకి, లిప్ స్టిక్‌కి విడదీయరాని అనుబంధం ఉంది. లిప్ స్టిక్‌ అంటే వారికి ప్రాణం. కొందరు లేడీస్ లిప్ స్టిక్ లేనిదే ఇంట్లో నుంచి బయటకి అడుగు పెట్టరు. అంతగా లిప్ స్టిక్‌కి అడిక్ట్ అయ్యారు. అలాంటి లిప్ స్టిక్ ప్రియులకు ఓ షాకింగ్ న్యూస్. లిప్ స్టిక్ చేసే నష్టం గురించి తెలిస్తే ఇక జన్మలో దాని జోలికి వెళ్లరు. పెదవులకు మరింత సౌందర్యాన్ని అద్దాలని చూసే వారు, అదరాలకు మరింత అందాన్ని ఇవ్వాలని ఆరాటపడే వాళ్లు.. చేతిలో ఉన్న లిప్‌స్టిక్ పెదవులను తాకక ముందే మేల్కొండి… మీరు వాడుతున్న లిప్ స్టిక్‌లో ఏముందో, అందులో ఎన్ని రకాల జబ్బులు దాగున్నాయో తెలుసుకోండి. మహిళల లిప్స్ రోగాల లిప్స్‌గా మారుతున్నాయి. కారణం లిప్ స్టిక్స్. వాటి తయారీలో వాడే రసాయన పదార్దాలే..

 

లిప్ స్టిక్స్‌లో వాడే ప్రమాదకర కెమికల్స్, వచ్చే రోగాలు:

* లెడ్, పెట్రో కెమికల్స్, క్రోమియం, కాడ్మియం, మెగ్నీషియం
* పెదవుల నుంచి శరీరంలోకి కెమికల్స్
* కాడ్మియం ఎక్కువగా చేరితే మూత్రపిండాలు చెడిపోతాయి
* కడుపులో కణితులూ రావచ్చు
* నాడీ వ్యవస్థపై ప్రభావం చూపనున్న లెడ్‌
* మెదడుకు నష్టం చేయనున్న లెడ్‌
* లెడ్ కారణంగా హార్మోన్ అసమతుల్యత, వంధత్వం
* లిప్‌స్టిక్‌లో క్యాన్సర్ కారక పదార్థాలు
* పునరుత్పత్తి, ఎదుగుదల, తెలివితేటలపై ప్రభావం చూపనున్న పెట్రోకెమికల్స్
* ఫార్మాల్డిహైడ్‌ కూడా క్యాన్సర్‌ కారకం
* శ్వాసలో గురక, దగ్గు, కళ్ళలో, చర్మంపై ఇరిటేషన్ వంటివి ఫార్మాల్డిహైడ్ వలన కలిగే ఇతర ప్రభావాలు.
* పారాబెన్స్, బిస్మత్ ఆక్సీ క్లోరైడ్ కూడా లిప్‌స్టిక్‌ తయారీలో ఉపయోగిస్తారు. ఇవి కూడా క్యాన్సర్ కారకాలు

 

నిరంతరం లో-క్వాలిటీ లిప్ స్టిక్స్ వాడకం ప్రాణాలను కూడా తీయొచ్చు. లిప్ స్టిక్స్‌లో క్రోమియం, కాడ్మియం, మెగ్నీషియం చాలా ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని పరిశోధనలు చెపుతున్నాయి. వీటి ఫలితంగా ప్రమాదకరమైన వ్యాధులు సంభవిస్తాయి. శరీరంలోని అవయవాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది.

 

ఇప్పటికైనా తెలిసిందా.. మీ అందమైన పెదవులు ఎంత ప్రమాదంలో పడ్డాయో…మీకు ఎన్ని రోగాలను అంటగడుతున్నాయో…నాణ్యత లేని వాటితో చాలా ప్రమాదం పొంచి వుంది…అలాగని బ్రాండెడ్ ఐటమ్స్ వల్ల ప్రమాదం లేదని కాదు…వాటి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అందం కోసం ఉపయోగించే సౌందర్య సాధనం……సౌందర్యపాశం కాకూడదు. ఇకనైనా కళ్ళు తెరవండి. మీ చేతిలోని లిప్ స్టిక్ మీ పెదవులను తాకే ముందు…ఒక్క సారి వాటివైపు పరిశీలనగా చూడండి. అవి మీకు అందాన్ని ఇస్తున్నాయో…అనారోగాన్ని ఇస్తున్నాయో తెలుసుకోండి. వీలైనంతవరకు నాణ్యత గల ఉత్పత్తులనే ఉపయోగించండి. చీప్‌గా దొరుకుతున్నాయని కొన్నారో…రోగాలను కూడా కొని తెచ్చుకున్నట్టే.