టూత్ పేస్ట్ ముఖానికి రాసే ముందు మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం. అదేంటంటే.. టూత్ పేస్టు రాస్తే మీ ముఖంపై మొటిమలు, నల్లటిమచ్చలు, ముడతలు పోతాయని చాలా మంది నమ్ముతున్నారు. అయితే డాక్టర్లు మాత్రం అది అబద్దం అని తెల్చేశారు.
చర్మవ్యాధి నిపుణులు మాట్లాడుతూ.. మీ చర్మంపై చాలా శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. మొటిమలకు టూత్ పేస్ట్ వాడద్దని, అది మీ చర్మానికి హానీకరమని తెలిపారు.
అంతేకాదు డాక్టర్. రెబెకా బాక్స్ట్ మాట్లాడుతూ.. చాలామంది దీని వల్ల ముఖంపై మొటిమలు పోగొడుతోందని భావిస్తున్నారు. కానీ టూత్ పేస్ట్ మీ చర్మాన్ని ఇరిటేట్ చేస్తుందని తెలిపారు.
అయితే చర్మవ్యాధి నిపుణులు ఇది చాలా చెత్త టిప్ అని తెలిపారు. ఎవరైతే ఇలా మొటిమలకు టూత్ పేస్ట్ ను ఉపయోగిస్తున్నారో వారు ఇప్పటికైనా ఈ అలవాటును మానుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.