Spinach
Spinach : ఆకుపచ్చని వర్ణంలో ఉండే పాలకూరను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పాలకూరలో విటమిన్లు, మినరల్స్, ఫైటో ట్యూయురెంట్స్ వంటివి పుష్కలంగా ఉండీ కేలరీలు తక్కువ మొత్తంలో ఉంటాయి. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ పాలకూరను తినవచ్చు. మెదడు ఆరోగ్యానికి పాలకూర ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. జ్ఞానశక్తిని మెరుగుపరుస్తుంది. ఫోలిక్ ఆమ్లం, విటమిన్ ఎ, విటమిన్ బి 6, విటమిన్ సి వంటి ఖనిజాలతో పాటు, అనేక ఇతర యాంటీ-ఆక్సిడెంట్లు మెదడుకు మేలు చేస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచేందుకు తోడ్పడతాయి.
పాలకూరలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది బోలు ఎముకల వ్యాధి రాకుండా చూస్తుంది. ఎముకలను బలంగా ఆరోగ్యంగా మారుస్తుంది. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలకు చక్కని పరిష్కారంగా తోడ్పడుతుంది. పాలకూర ఆస్తమా ఉపశమనం కోసం చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. పాలకూరలో ఉండే పోషకాలు ఆస్తమా లక్షణాలను నియంత్రణలో ఉంచటానికి సహాయపడతాయి. పాలకూరలో సమృద్దిగా ఉండే ఫోలెట్ , బీటా కెరోటిన్ ఆస్తమా నుండి రక్షణ కల్పిస్తాయి. వారంలో రెండు పర్యాయాలు పాలకూరను తీసుకోవచ్చు.
పాలకూరలో అధిక మొత్తంలో ఉండే ప్రొటీన్లు కడుపు నిండిన భావన కలిగిస్తాయి. దీని వల్ల కడుపు నిండిన భావన కలిగి ఎక్కువ మొత్తంలో తినలేరు. పాలకూర జీర్ణ వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. బరువు అధికంగా ఉన్నవారు పాల కూర తీసుకోవటం ద్వారా బరువును క్రమేపి తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది. దీనిలో కేలరీలు తక్కువగా మోతాదులో ఉండటం వల్ల బరువును ఈజీగా తగ్గవచ్చు.
గమనిక: ఈ సమాచారం అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా సేకరించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందగలరు.