Benefits Of Fenugreek : పొట్టను కరిగించటంతోపాటు మెంతులతో మీకు తెలియని మరెన్నో ప్రయోజనాలు!

రక్తంలో ఇన్సులిన్ స్ధాయిని తగ్గించటం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచటంలో మెంతులు సహాయకారిగా దోహదపడతాయి. కీళ్ల నొప్పులు దూరం చేయటంతోపాటు శ్వాస సంబంధిత రుగ్మతలను, మూత్రనాళ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి.

Benefits Of Fenugreek : పొట్టను కరిగించటంతోపాటు మెంతులతో మీకు తెలియని మరెన్నో ప్రయోజనాలు!

Benefits Of Fenugreek :

Updated On : December 17, 2022 / 5:33 PM IST

Benefits Of Fenugreek : ప్రతి ఇంటి వంటగదిలో ఉండే మెంతులు తినటానికి ఏమాత్రం రుచిగా ఉండవు. అయితే ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. దీనిలో ప్రొటీన్ల శాతం అధికం. శరీరంలో అధికంగా కొలెస్ట్రాల్ ఉన్నవారు మజ్జిగలో ఒక స్పూన్ మెంతులను రాత్రి సమయంలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. ఇలా చేస్తే కొలెస్ట్రాల్ కరగటంతోపాటు బానపొట్ట కరిగిపోతుంది.

జీర్ణక్రియ సరిగా లేకపోయినా, మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నా, పొట్ట ఉబ్బరంగా ఉన్నా అరస్పూన్ మెంతులను నానబెట్టి తినాలి. మెంతులను కాకుండా మెంతి కూరను చపాతీల్లో తిన్నా మంచి ఫలితం ఉంటుంది. గొంతు నొప్పి సంబంధిత సమస్యలను అదుపులో ఉంచటానికి మెంతులు బాగా తోడ్పడతాయి.

రక్తంలో ఇన్సులిన్ స్ధాయిని తగ్గించటం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచటంలో మెంతులు సహాయకారిగా దోహదపడతాయి. కీళ్ల నొప్పులు దూరం చేయటంతోపాటు శ్వాస సంబంధిత రుగ్మతలను, మూత్రనాళ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి.

జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారు మెంతుల పొడి, పెరుగు కలిపి నానబెట్టి జుట్టు రాసి, మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మెంతులు జుట్టు రాలే సమస్యను అరికట్టటంతోపాటు త్వరగా జుట్టు నెరవకుండా కాపాడతాయి. బాలింతల్లో పాల ఉత్పత్తి పెరగాలంటే మెంతికూరను పప్పులో వేసుకుని తీసుకోవాలి. ఇలా చేస్తే పాలు బాగా పడతాయి.

అయితే మెంతులను అతిగా ఉపయోగించరాదు. అతిగా వాడితే సమస్యలను కొనితెచ్చుకోవాల్సి వస్తుంది. వీటి వల్ల కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయి. అంతిసారం, కడుపునొప్పి , గ్యాస్ , తలనొప్పి వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

గర్భదారణతో ఉన్న వారు మెంతులు వాడకపోవటమే శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు. మెంతుల వినియోగం వల్ల పిండంలో మార్పులు చోటు చేసుకునే ప్రమాదం ఉంటుంది. మధుమేహులు మోతాదుకు మించి వాడితే రక్తంలో చక్కెర స్ధాయిలు పడిపోయే ప్రమాదం చోటు చేసుకుంటుంది.