Heart Issues Under 50: ఫిట్ ఈజ్ నాట్ హెల్తీ.. 50ఏళ్లలోపే గుండెపోటుతో అకాల మరణాలు!

ఫిట్‌గా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బయటకు కనిపించని ఎన్నో అనారోగ్య సమస్యలు అకాల మరణానికి దారితీస్తాయని అంటున్నారు.

heart issues in under-50s : ఫిట్‌గా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బయటకు కనిపించని ఎన్నో అనారోగ్య సమస్యలు అకాల మరణానికి దారితీస్తాయని అంటున్నారు. అందులో ఎక్కువగా గుండెజబ్బులే అధికంగా ఉన్నాయని చెబుతున్నారు. చూడటానికి ఎంతో ఫిట్ గా ఉన్నట్టు కనిపిస్తుంటారు. కానీ, వారిలో తెలియని ఆందోళన, మానసిక ఒత్తిడితో నిత్యం సతమతవుతుంటారు. అలాంటి వారిలో గుండెపోటు సమస్య అధికంగా ఉంటుందని ఓ కొత్త అధ్యయనంలో తేలింది. అకాల మరణానికి గురయ్యే వారిలో ఎక్కువగా 50లోపు వయస్సు ఉన్నవారే ఎక్కువగా ఉన్నారని నిపుణులు వెల్లడించారు.

అందుకే ఎప్పుడైనా మానసిక ఒత్తిడితో పాటు ఇతర అనారోగ్య సంకేతాలను నిర్లక్ష్యం చేయరాదని సూచిస్తున్నారు. ఏడాదిలో లేదా ఆరు నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోవడం ఆయుష్షును పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఒకప్పుడు 50ఏళ్లు పైబడిన వారిలోనే ఎక్కువగా హార్ట్ ఎటాక్ సమస్యలు ఉండేవి. కానీ, ఇప్పుడు 25ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్యవారిలోనూ గుండెపోటు వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. పైకి ఫిట్ గా కనిపించినా.. వారిలో ఒత్తిడి కారణంగా ఆకస్మాత్తుగా గుండెపోటు వంటి సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. ఉదయం వరకు బాగానే ఉన్నా రాత్రి పడుకున్నాక నిద్రలోనే గుండెలు ఆగిపోతున్నాయి.

నటుడు సిద్ధార్థ్ శుక్లా (40) గుండెపోటుతో ఆకస్మిక మరణానికి గురయ్యాడు. గత వారం సిద్ధార్థ్ కు రాత్రి 3 గంటల సమయంలో ఛాతిలో నొప్పి వచ్చింది. అయినా అలానే నిద్రపోయాడు. నిద్రలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఉదయం లేవకపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సిద్ధార్థ్ మరణించినట్టు వైద్యులు తేల్చేశారు. సిద్ధార్థ్ మరణం అందరిని షాకింగ్ గురిచేసింది. 30ఏళ్ల నుంచి 40ఏళ్ల మధ్య వయస్సు వారిలో గుండెపోటు వచ్చే ముప్పు అధికంగా ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వారంతా ఫిట్ గా ఉన్నప్పటికీ కూడా హార్ట్ ఎటాక్ వస్తుందని హెచ్చరిస్తున్నారు. అంటే.. 30ఏళ్ల నుంచి 40ఏళ్ల వయస్సు పేషెంట్లలో 10మందిలో ఇద్దరు గుండెపోటుతో మరణిస్తున్నారని నివేదిక వెల్లడించింది. యువకుల్లోనూ హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అంటున్నారు. అందులో డయాబెటిస్, హైబ్లడ్ ప్రెజర్, కుటుంబంలో ఎవరికైనా గుండెజబ్బులు ఉన్నా, అధిక కొవ్వు, పొగతాగే అలవాటు ఉన్నా వారిలోనూ గుండెజబ్బుల ముప్పు ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Covid-19 Vaccine : రెండు డోసులు వేర్వేరు వ్యాక్సిన్లు వద్దు : స్పష్టంచేసిన కేంద్ర ఆరోగ్య శాఖ

కొవిడ్ రికవరీ తర్వాత 6 నెలల్లో హార్ట్ స్ర్కీనింగ్ తప్పనిసరి :
కరోనా నుంచి కోలుకున్నవారు కూడా తప్పనిసరిగా గుండె ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి స్ర్కీనింగ్ తప్పనిసరిగా చేయించుకోవాలి. కరోనా తర్వాత మైయోకార్డియల్ ఇన్ ఫ్లేమేషన్ కారణంగా గుండెలో అంతర్గతంగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కోలుకున్న కోవిడ్ పేషెంట్లు నెమ్మదిగా వ్యాయామాలు చేయడం ఆరంభించాలి. అది కూడా వైద్యుల సలహాతోనే.. ఎందుకంటే వారిలో ఎక్కువగా ఆయాసం, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం, గుండె దడ, ఛాతిలో నొప్పి లేదా కళ్లు తిరగడం వంటి సమస్యలు అధికంగా ఉంటాయి.

30, 40ఏళ్లలోనే గుండెపోటుతో మరణాలు ఎందుకంటే? :
అందుకు కారణం.. మానసిక ఒత్తిడి.. అలాగే రెగ్యులర్ మెడికల్ చెకప్ చేయించుకోవాలి. ఎలాంటి అసౌకర్యం అనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యసాయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. యువకుల్లో ఇలాంటి సమస్య వచ్చినా పెద్దగా పట్టించుకోరు. పొరపాటుగా అది గ్యాస్ అంటూ కొట్టిపారేస్తుంటారు. కానీ, అది గుండెనొప్పికి దారితీసి చివరికి అకాల మరణాలకు దారితీస్తోంది. యువ్వనంలోనూ గుండె ధమనులు బ్లాక్ అవుతాయనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. ఏడాదిలో ఒకసారి కూడా హెల్త్ చెకప్ చేయించుకోరు. కుటుంబంలో ఎవరికైనా గుండెపోటు సమస్య ఉంటే.. 25ఏళ్లు దాటగానే వెంటనే హెల్త్ చెకప్ చేయించుకోవాలి.

ఒకవేళ మీ కుటుంబంలో ఎవరైనా 35ఏళ్లకే గుండెపోటుతో మరణిస్తే.. మీరు మీ వయస్సు 25ఏళ్లు దాటగానే రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకోవడం చాలా ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. వయస్సు పెరిగేకొద్ది శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. లోపల ఏం జరుగుతుందో కూడా గ్రహించలేము. బయటకు అంతా బాగానే కనిపించినా.. లోలోపల అనారోగ్య సమస్యలు పెరిగిపోతుంటాయి. 30ఏళ్లలోనే ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్టు గుర్తిస్తే వెంటనే మందులతో కంట్రోల్ చేసుకోవాలి. ప్రస్తుత రోజుల్లో తీవ్ర ఒత్తిడి కారణంగా గుండెపోటకు కారణమవుతుంది. అందులోనూ కరోనా మహమ్మారి సమయంలో గుండెపోటుకు దారితీస్తోంది. ఒత్తిడి ఎంత ఉందో గుర్తించడం కష్టం.. అందుకే జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. యోగా, మెడిటేషన్, వ్యాయామాలను చేస్తుండాలి.

ఈ చెడు అలవాట్లను మానుకోండి :
ఒత్తిడిని తగ్గించుకోవాలి. నిద్రలేమి సమస్య నుంచి బయటపడాలి. మద్యం సేవించరాదు.. పొగతాగే అలవాటు మానుకోవాలి. అసురక్షితమైన సప్లిమెంట్స్, స్లిమ్మింగ్ పిల్స్ వాడరాదు. వీటి కారణంగా అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. ఫలితంగా హార్ట్ ఎటాక్స్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ప్రతిఒక్కరూ 25ఏళ్లు దాటిన తర్వాత తప్పనిసరిగా హెల్త్ చెకప్ చేయించుకోవాలి. హార్ట్ హెల్తీ డైట్ పై ఫోకస్ పెట్టాలి. కార్బొహైడ్రేట్లు, ఫ్యాట్, ప్రోటీన్లు తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు ఆహారంలో చేర్చుకోవాలి.
Diabetes : షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా… ఎలాంటి పండ్లు తినాలంటే?

ఈ వార్నింగ్ సైన్స్ ఉన్నాయా లేదో గమనించండి :
మీకు రాబోయే అనారోగ్య సమస్యకు ముందుగానే కొన్ని వార్నింగ్ సైన్స్ కనిపిస్తుంటాయి. అందులో హార్ట్ ఎటాక్ రావడానికి ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. శ్వాస తీసుకోలేకపోవడం, ఛాతిలో భారంగా ఉండటం, ఎడమి భుజంలో నొప్పి, దవడ వద్ద లాగినట్టు అసౌకర్యంగా ఉండటం, వ్యాయామం సమయంలో ఇలాంటి సంకేతాలు కనిపిస్తే వెంటనే వైద్య సాయం తీసుకోండి. తద్వారా అకాల మరణ ముప్పు నుంచి బయటపడొచ్చు. గుండెలో చిన్నపాటి బ్లాకులతో కూడా తీవ్ర గుండెనొప్పి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇలాంటి అనారోగ్య సమస్యల చరిత్ర ఉన్నవారు తప్పనిసరిగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోవడం చాలా ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. లైఫ్ స్టయిల్ మార్చుకోవాలి. CPR ఎలా చేయాలో నేర్చుకోవాలి. గుండెపోటు కారణంగా ఒక వ్యక్తి కుప్పకూలినప్పుడు వారిని బ్రతికించడానికి మూడు-నాలుగు నిమిషాలు చాలా కీలకం.. ఆ సమయంలో CPR చేయడం (ఛాతిపై ఒత్తడం లేదా నోట్లో శ్వాస అందించడం) ద్వారా ప్రాణాలు కోల్పోకుండా కాపాడే అవకాశం ఉంది. అయితే CPR ప్రాసెస్ గురించి అవగాహన పెంచుకోవడం ఎప్పుటికైనా ఉపయోగపడుతుంది.

ట్రెండింగ్ వార్తలు