Dr. Yatindra Vityala Journey : ప్రశ్న నుంచి పరిశోధన వరకు : కొత్త తరానికి దారి చూపుతున్న డాక్టర్ యతీంద్ర విట్యాల
Dr. Yatindra Vityala Journey : తెలంగాణలోని వరంగల్‌కు చెందిన డాక్టర్ యతీంద్ర విట్యాల వైద్యం, శాస్త్రీయ రచన, పరిశోధనా విద్య రంగాల్లో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. యువతకు పరిశోధన అవకాశాలను పరిచయం చేస్తూ, శాస్త్రీయ విజ్ఞానాన్ని ప్రోత్సహిస్తున్నారు.
- Sreehari A
- Updated on- October 10, 2026 / 01:07 PM IST
Dr. Yatindra Vityala Journey
- తెలంగాణ నుంచి వైద్యపరిశోధన, విద్య, సాంకేతికతలను అనుసంధానించే ప్రయాణం
Dr. Yatindra Vityala Journey : ఒక మంచి ప్రశ్న ఒక జీవితాన్ని మార్చగలదు. అదే ప్రశ్నకు శాస్త్రీయ ఆధారాలతో సమాధానం వెతికితే, అనేక మంది జీవితాలను ప్రభావితం చేయగలదు. వైద్య రంగంలో ఈ రెండిటి మధ్య దూరాన్ని తగ్గించడానికి పరిశోధనా నైపుణ్యాలు అవసరం.
తెలంగాణలోని వరంగల్ కు చెందిన వైద్యుడు, పరిశోధకుడు, డాక్టర్ యతీంద్ర విట్యాల (Dr. Yethindra Vityala) ప్రయాణాన్ని ఈ కోణం లో చూడవచ్చు. వైద్యం, శాస్త్రీయ రచన, పరిశోధనా విద్యను కలిపి ముందుకు సాగుతున్న ఆయన, యువతకు పరిశోధనలో (Dr. Yatindra Vityala Journey) అవకాశాలను పరిచయం చేస్తున్నారు.
వైద్య విద్యార్థికి పాఠ్యపుస్తకం వ్యాధి గురించి వివరిస్తుంది. ఆస్పత్రిలో ఎదురయ్యే అనుభవం కొత్త ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఒకే చికిత్సకు రోగులు భిన్నంగా ఎందుకు స్పందిస్తారు? ఆరోగ్య సమస్యను ముందుగా గుర్తించడం సాధ్యమా? అందుబాటులో ఉన్న ఆధారాలను వైద్య నిర్ణయాల్లో ఎలా ఉపయోగించాలి? ఇలాంటి ప్రశ్నలను పరిశోధనగా మలచగల సామర్ధ్యం వైద్య విద్యకు మరింత లోటును ఇస్తుంది. యతీంద్ర చేస్తున్న పనిలో పరిశోధనా విద్యకు ప్రాధాన్యం ఉండటం ఈ నేపధ్యంలో ప్రత్యేకంగా కనిపిస్తుంది.
ఆయన పరిశోధన ఆసక్తులు వైద్య సమస్యలతో అనుసంధానమై ఉన్నాయి. యువకుల్లో గుండెపోటుకు సంభందించిన క్లినికల్ లక్షణాలు, ఇతర ప్రభావకరాలపై ప్రచురితమైన అధ్యయనంలో ఆయన సహాయ రచయితగా ఉన్నారు. ఇలాంటి పరిశోధనలు వ్యాధిని వివరించడంతో పాటు, దాని వెనుక ఉన్న సంబంధాలను మరింత స్పష్టంగా అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఒక అధ్యయనం అందించే సమాధానం తదుపరి శాస్త్రీయ ప్రశ్నకు పునాది వేస్తుంది.
12 ప్రపంచ రికార్డులతో ప్రత్యేక గుర్తింపు :
వైద్య పరిశోధన, విద్య, ఆవిష్కరణ రంగాల్లో డాక్టర్ యతీంద్ర విట్యాల పలు గుర్తింపులు అందుకున్నారు. వైద్య రంగంలో ” ప్రపంచములోనే అత్యంత చిన్న వయస్కుడైన శాస్త్రవేత్త ” గా గుర్తింపు పొందిన డాక్టర్ యతీంద్ర మొత్తం 12 ప్రపంచ రికార్డులతో పాటు 110 కు పైగా సమీక్షిత పరిశోధనా ప్రచురణలు, రెండు అకాడమిక్ పుస్తకాలతో తన శాస్త్రీయ కృషిని వివరించారు. ఆరు దేశాల ప్రభుత్వాలు, ఆరోగ్య మంత్రిత్వ శాఖలతో పని చేసిన అనుభవం ఆయనకు ఉంది.
పరిశోధనా విద్యలో ప్రోత్సహింసడంలో చేసిన కృషికి టైమ్స్ ఇంటర్నెట్ ఎకోప్రెన్యూర్ అవార్డ్స్ – 2026 లో ” గ్రీన్ ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ ఇనిషియేటివ్ అఫ్ ది ఇయర్ ” వ్యక్తిగత విభాగంలో పురస్కారం అందుకున్నారు. అలాగే “ది నెక్స్ట్ జీన్ బయో సైన్స్ సమ్మిట్ -2026 ” లో ” కలాం మెడల్ ఫర్ ఎక్స్లెన్స్ ఇన్ ట్రాన్సిలేషన్ ఇన్నోవేషన్ ” దేశ్ భగత్ యూనివర్సిటీ కోర్ రీసెర్చ్ ఎక్సల్లెన్స్ అవార్డ్స్ -2026 “యంగ్ సైంటిస్ట్ అవార్డు ” ఆయనను వరించాయి.
పరిశోధన చేయాలనే ఆసక్తి ఉన్న ప్రతి విద్యార్థికీ సరైన మార్గదర్శకత్వం అందుబాటులో ఉండదు. పరిశోధనా ప్రశ్నను రూపొందించడం, అధ్యయన పద్దతిని ఎంచుకోవడం, ఫలితాలను అర్ధం చేసుకోవడం, స్పష్టంగా రాయడం ఆలా ప్రతి దశ లోను నేర్చుకోవాల్సిన అంశాలు ఉంటాయి.
ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకొని విద్య, పరిశొధన, సాంకేతికతలను అనుసంధానించే లక్ష్యం తో పని చేస్తున్న (SCIVYT Research Technologies) సంస్థకు డాక్టర్ యతీంద్ర విట్యాల వ్యవస్థాపకుడు, ముఖ్యకార్యనిర్వహణాధికారిగా ఉన్నారు. సంస్థ విధానంలో మానవ నైపుణ్యం, కృత్రిమ మేధ, పారదర్శక పరిశోధనకు ప్రాధాన్యం ఇస్తుంది.
ఈ ప్రయత్నం వెనుక ఉన్న ఆలోచన సమకాలీయమైనది. డిజిటల్ సాధనాలు సమాచారాన్ని వేగంగా అందించగలవు. కానీ ఆ సమాచారం సరైనదా, పరిశోధన పద్దతి సముచితమా, ఫలితాల నుంచి తీసుకున్న నిర్ణయం ఆధారాలు అనుగుణంగా ఉందా అనే విషయాలను పరిశీలించడానికి శాస్త్రీయ అవగాహన అవసరం. అందుకే పరిశోధన విద్యలో సాంకేతికతతో పాటు విమర్శనాత్మక ఆలోచన, నైతిక బాధ్యత, గురువుల మార్గదర్శకత్వం కూడా కీలకం.
తెలంగాణ యువతకు ఆదర్శంగా :
తెలంగాణ యువతకు యతీంద్ర ప్రయాణంలో దగ్గరగా అనిపించే అంశం, స్థానిక నేపధ్యం నుంచి విస్తృతమైన శాస్త్రీయ ప్రపంచంతో సంభందాలు నిర్మించుకోవడం, పరిశోధనపై ఆసక్తి ఉన్న విద్యార్థి తన మొదటి అడుగు ఎక్కడ వేయాలో తెలుసుకోవడం ముఖ్యం. మంచి ప్రశ్నను గుర్తించడం, ఉన్న శాస్త్రీయ సాహిత్యాన్ని చదవడం, అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం వంటి చిన్న అడుగులే ఆ ప్రయాణానికి బలం ఇస్తాయి. పరిశోధనను పరిచయం చేసే వేదికలు ఆ ప్రారంభాన్ని సులభం చేయగలవు.
యతీంద్ర విట్యాల కధలో వ్యక్తిగత విజయాలతో పాటు, వైద్య పరిజ్ఞానాన్ని ఇతరులకు ఉపయోగపడే అవకాశాలుగా మలచే ప్రయత్నం కనిపిస్తుంది. ఒక వైద్యుడు రోగిని చూసే సమయంలో పుట్టిన ప్రశ్న, ఒక విద్యార్థి పరిశొధన ఆలోచనగా మారవచ్చు. ఆ ఆలోచనకు సరైన పద్దతి, మార్గదర్శకత్వం లభిస్తే ఉపయోగకరమైన ఆధారాలు వెలువడవచ్చు. ఆ ప్రయాణం లో మరింతమంది యువత భాగస్వాములు కావడానికి దారులు నిర్మించడమే ఆయన పనిలోని ప్రధాన ఆకర్షణ.
