డిన్నర్ చేయడానికి సరైన సమయమిదే.. ఎందుకో తెలుసా

Dinner Time: రోజు మొత్తంలో ఆహారం ఎలాగైనా తీసేసుకుంటాం. దానికి ఒక టైం ఫిక్స్ అవ్వం. కానీ, ఫిక్స్ అయితే ఏమవుతుంది. టైం అనేది నిజంగా అంత ఇంపార్టెంటా తెలుసుకుందామా..

కొద్ది కిలోల బరువు పెరగాలన్నా, తగ్గాలన్నా డిన్నర్ టైం ప్రకారం చేయడమనేది చాలా ఇంపార్టెంట్. ప్రత్యేకమైన టైమింగ్స్ కచ్చితంగా పాటించాలి.

డిన్నర్ టైం ఫిక్స్ చేయడం వల్ల బెనిఫిట్స్
చెప్పుకోవడానికి డిన్నర్ కు ఫిక్స్ డ్ టైం అంటూ ఉండదు. అది మనం పడుకునే సమాయాన్ని బట్టి అది ఉంటుంది. అలా నిద్రపోవడానికి, ఆహారం తీసుకోవడానికి ఒక టైం ఫిక్స్ చేసుకుంటే ఆరోగ్యంగా నిద్రలేస్తాం.

డిన్నర్ చేయడానికి బెస్ట్ టైం ఏంటి
చాలా కరెక్ట్ టైం ఏంటో తెలుసుకోవడానికి ముందు అదెందుకో ముఖ్యమో తెలుసుకుందాం.

ముందుగా తినడం వల్ల బరువు తగ్గొచ్చు
మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే.. డిన్నర్ చాలా ముందుగా తినడం అలవాటు చేసుకోండి. లేదంటే లంచ్ లేట్ గా చేయడం మానేయండి.

ఓ రీసెర్చ్ ప్రకారం.. రోజూ తినే టైం కంటే 90 నిమిషాలు లేట్‌గా తింటే.. డిన్నర్ 90నిమిషాలు ముందుగా తింటే శరీరంలో ఫ్యాట్ ఉన్న దాని కంటే డబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయట.

లేట్ డిన్నర్లతో హార్ట్ హెల్త్‌కు ఎఫెక్ట్
మీరు తినేముందు హార్ట్ హెల్త్‌పై కూడా దృష్టి పెట్టండి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సైంటిఫిక్ సెషన్స్ 2019 వేదికగా వెల్లడించిన రీసెర్చ్ ప్రకారం.. సాయంత్రం 6గంటల తర్వాత ఎక్కువ క్యాలరీలు తీసుకున్న వారిలో గుండె ఆరోగ్యం మరీ బలహీనంగా ఉంటుందట.

తినడానికి సరైన సమయం
ప్రతి ఒక్కరు లంచ్ సమయం అయిన నాలుగైదు గంటల తర్వాత లంచ్ చేయాలి. దాని కంటే ముందు నిద్రపోవడాని కంటే కాస్త ఎక్కువ సమయం ఉండగానే డిన్నర్ పూర్తి చేసేయడం బెటర్.

డిన్నర్ లేట్‌గా తింటే లైట్ ఉండాల్సిందే
ఒకవేళ తినడం ఆలస్యమైతే మాత్రం.. ఆరోగ్యంగా ఉండటానికి కాస్త లైట్ ఫుడ్ మాత్రమే తీసుకోండి.

నిజానికి డిన్నర్ అనేది రోజూ ఒకే సమయానికి తినేయాలి. శరీరానికి రాత్రి సమయంలో లేట్‌గా క్యాలరీలు అందితే శక్తిగా మార్చడానికి బదులు ఫ్యాట్‌గా మార్చేసుకుంటుంది శరీరం. దాని ద్వారా బరువు పెరగడం లేదా ఆరోగ్య సమస్యలు వస్తాయి.