Black Gram Lentil : మినప పప్పుతో చేసిన వంటకాలను ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!

ఎముకలు విరిగిన వారు, కీళ్లవాతం, ఆర్థటైటిస్ సమస్యతో బాధ పడుతున్న వారు మినుములతో చేసిన ఆహారాలు తీసుకోవటం మంచిది. ఇవి ఎముకలు బలంగా, ధృఢంగా మారడానికి దోహదపడతాయి. మినుముల్లో పుష్కలంగా ఉన్న పొటాషియం, పీచుపదార్థాలతో గుండె జబ్బులను నివారించవచ్చు.

Black lentils

Black Gram Lentil : మినుముల్లోని పోషకాలు అధికంగా ఉంటాయి పీచు పదార్థం, పొటాషియం,కొవ్వు, విటమిన్ సీ, విటమిన్ బీ- కాంప్లెక్స్‌లోని బీ1, బీ3 తోపాటు, కాల్షియం, మెగ్నిషియం, ఐరన్ వంటివి కూడా పుష్కలంగా ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో మినుములు ఎంతగానో ఉపయోగపడుతాయి. అనేక రోగాల నుంచి కాపాడతాయని పోషకాహార నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మినుములతో ఉదయం పూట ఇడ్లీ, అట్టు, గారె, వడ వంటి అల్పాహారాలను తయారుచేసుకుని తీసుకుంటారు.

మినపప్పు జీర్ణక్రియను మెరుగుపరిచి బలాన్ని చేకూరుస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మినుముల్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణసమస్యలతో బాధపడేవారు మినుములను ఆహారంలో చేర్చుకుంటే ప్రయోజనం కలుగుతుంది. మలబద్దకం, ఉబ్బసం లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇన్సులిన్, గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేసి.. డయాబెటిస్ నియంత్రణలో ఉంచటంలో మినుములు ఉపకరిస్తాయి.రక్తహీనత సమస్యను కూడా నివారిస్తాయి. మినుముల్లో మంటను తగ్గించే యాంటీ-ఇన్‌ప్లమేటరీ గుణం వల్ల గాయాలు, నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు.

ఎముకలు విరిగిన వారు, కీళ్లవాతం, ఆర్థటైటిస్ సమస్యతో బాధ పడుతున్న వారు మినుములతో చేసిన ఆహారాలు తీసుకోవటం మంచిది. ఇవి ఎముకలు బలంగా, ధృఢంగా మారడానికి దోహదపడతాయి. మినుముల్లో పుష్కలంగా ఉన్న పొటాషియం, పీచుపదార్థాలతో గుండె జబ్బులను నివారించవచ్చు. డయాబెటిస్ తో బాధపడే వారికి, ఊబకాయంతో బాధపడే వారికి, రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్స్ ఎక్కువగా ఉన్నవారికి మినపప్పు గారెలు మంచి ఆహారం. మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. మినప పప్పు పురుషులకు స్పెర్మ్ కౌంట్ ను పెంచుతుంది. సంతానం కలిగే అవకాశాలను పెంచుతుంది.