prevent skin problems
Prevent Skin Problems : వర్షాకాలంలో వచ్చే అతి పెద్ద అసౌకర్యాలలో ఒకటి ఫంగల్ ఇన్ఫెక్షన్. వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. గాలి తాజాగా ఉంటుంది. దురదృష్టవశాత్తు ఈ కాలం అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా బాధించేవి ఫంగల్ ఇన్ఫెక్షన్లు. ఈ సమస్య చాలా మందిలో అసౌకర్యం కలిగిస్తాయి. వీటిని వదిలించుకోవటం కష్టంగా ఉంటుంది. వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు రాకుండా హాయిగా, ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.
READA ALSO : Turmeric For Skin Care : వేసవిలో కూడా మీ చర్మం మెరవాలంటే చర్మ సంరక్షణలో దీనిని చేర్చుకోండి ?
ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో మొదటి దశ మంచి పరిశుభ్రతను పాటించడం. దీని అర్థం క్రమం తప్పకుండా స్నానం చేయడం, తరచుగా చేతులు కడుక్కోవడం, ప్రతిరోజూ బట్టలు మార్చుకోవడం. మీ పాదాలను శుభ్రంగా ,పొడిగా ఉంచడం కూడా చాలా ముఖ్యం. పాదాలకు గాలి సరిగా అడేలా చూసుకోవాలి. కాళ్లను కప్పిఉంచే బూట్లకు బదులుగా చెప్పులు , ధరించాలి. చేతులు, కాళ్ల వేలి గోళ్లను చిన్నగా, శుభ్రంగా కత్తిరించడం చాలా ముఖ్యం. ఎందుకంటే గోళ్ల కింద , చుట్టూ బ్యాక్టీరియా , శిలీంధ్రాలు పెరగకుండా నిరోధించవచ్చు.
READA ALSO : Dry Skin : చలికాలంలో బాధించే పొడి చర్మం సమస్యను సహజ చిట్కాలతో తొలగించుకోండి!
వర్షాకాలంలో బిగుతుగా ఉండే దుస్తులను నివారించాలి. బిగుతుగా ఉండే దుస్తులు శరీరంపై తేమ, వేడిని కలిగిస్తాయి. తద్వారా శిలీంధ్రాలు పెరగడానికి అనువైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించడం వల్ల చర్మాన్ని పొడిగా , చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. స్పాండెక్స్ , నైలాన్ వంటి సింథటిక్ ఫ్యాబ్రిక్‌లను ధరించకూడదు. ఎందుకంటే ఈ దుస్తులు గాలిలోపలకు ప్రవేశించకుండా చేస్తాయి. దీంతో శరీరంపై వేడి, తేమను కలిగిస్తాయి.
READA ALSO : Effects of Smoking : చర్మం, జుట్టు , కంటి ఆరోగ్యంపై ధూమపానం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ?
ఫంగల్ ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఉండాలంటే వాతావరణాన్ని పొడిగా ఉంచుకోవాలి. వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా కురిసే ప్రాంతంలో నివసిస్తుంటే, నివాస స్థలంలో నీరు నిల్వ ఉండి తడిగా మారకుండా చూసుకోవడం చాలా అవసరం. గాలిలో తేమను తగ్గించడానికి, శిలీంధ్రాల పెరుగుదలను నివారించటానికి ఇంటిలోని అన్ని ప్రాంతాలు బాగా వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. అదనంగా, గాలిలో అదనపు తేమను తగ్గించడానికి అవసరమైతే డీహ్యూమిడిఫైయర్‌ని ఉపయోగించాలి.
READA ALSO : చర్మంపై దద్దుర్లు వస్తున్నాయా?
తువ్వాలు, దుస్తులు వంటి వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోకుండా ఉండాలి. ప్రత్యేకించి ఇప్పటికే ఫంగల్ ఇన్ఫెక్షన్ సంకేతాలతో బాధపడుతున్న వారు ఉపయోగిస్తున్న వస్తువులను వాడుకోవటం వల్ల వ్యక్తి నుండి వ్యక్తికి ఫంగల్ ఇన్ఫెక్షన్ సంక్రమణ చెందుతుంది. కొన్ని బహిరంగ ప్రదేశాల్లో చెప్పులు లేకుండా నడవడం నివారించాలి. ఎందుకంటే ఈ ప్రదేశాల్లో తేమ ఎక్కువగా ఉంటుంది, ఇది శిలీంధ్రాలకు సంతానోత్పత్తికి కారణమవుతుంది.
READA ALSO : Best Skin Oils : ఈ ఆయిల్స్ వాడితే మీ చర్మం హైడ్రేట్ గా ఉంటుంది!
వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్లకు తగిన చికిత్స చేయడం ముఖ్యం. తేలికపాటి ఫంగల్ ఇన్ఫెక్షన్‌లకు చికిత్స చేయడానికి యాంటీ ఫంగల్ క్రీమ్‌లు, స్ప్రేలను ఉపయోగించవచ్చు, మరింత తీవ్రమైన ఇన్ఫెక్షన్ బారిన పడితే మాత్రం వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది. దీని వల్ల మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చు. ఈ సాధారణ చిట్కాలను అనుసరించడం ద్వారా వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.