Best Skin Oils : ఈ ఆయిల్స్ వాడితే మీ చర్మం హైడ్రేట్ గా ఉంటుంది!

టీ ట్రీ ఆయిల్ అనేది చలికాలంలో చర్మానికి మేలు కలిగించే నూనె. ఇది యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది. పొడి, దురద మరియు మంట వంటి సమస్యలతో పోరాడుతుంది. కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, బాదం నూనెతో కలిపి ఉపయోగించటం ద్వారా మంచి ప్రయోజనాలు పొందవచ్చు.

Best Skin Oils : ఈ ఆయిల్స్ వాడితే మీ చర్మం హైడ్రేట్ గా ఉంటుంది!

Best Skin Oils :

Best Skin Oils : ముఖానికి నూనె రాస్తే చర్మం చాలా జిడ్డుగా మారుతుందని చాలా మంది భావిస్తుంటారు. అయితే అది పొరపాటే అవుతుంది. ఎందుకంటే చర్మాన్ని హైడ్రేట్ గా మరియు మెరుస్తూ ఉండేందుకు కొన్ని రకాల ఆయిల్స్ సహాయపడతాయి. రసాయనాలు నిండిన క్రీములు, లోషన్లను చర్మానికి దూరంగా ఉంచటం మంచిది. ఎందుకంటే ఇందులోని కొన్ని యాసిడ్స్ చర్మ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసి చర్మానికి నష్టం కలిగిస్తాయి. సహజ నూనెలను ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచే ఆయిల్స్ ;

కొబ్బరి నూనె ; కొబ్బరి నూనె చర్మానికి చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇది చర్మాన్ని మాయిశ్చరైజింగ్ గా తోడ్పడటంతోపాటు చర్మంపైన ఉండే మృత కణాలను తొలగించటంలో తోడ్పడుతుంది. ఒక స్పూను కొబ్బరి నూనెను ముఖం, చేతులు, పాదాలకు అప్లై చేయడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. చర్మ ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. స్నానికి ముందు కొబ్బరినూనెను మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు.

బాదం నూనె ; పొడి చర్మం కోసం బాదం నూనె ఉపయోగకరంగా ఉంటుంది. దురద, పుండ్లు పడడం, పొడిబారడం నుండి ఉపశమనం కలిగిస్తుంది. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. చర్మ కణాలను పునరుజ్జీవింపజేసి మెరిసేలా చేస్తుంది. బాదం నూనెలో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. చర్మం తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. చలికాలంలో చర్మపు దద్దుర్లు మరియు చికాకులను నయం చేస్తుంది. ఫేస్ ప్యాక్‌లలో ఉపయోగించవచ్చు.

జోజోబా ఆయిల్ ; పొడి చర్మాన్ని రక్షించడంలో జోజోబా ఆయిల్ బాగా ఉపకరిస్తుంది. ఇందులో జింక్ మరియు కాపర్, విటమిన్లు బి మరియు ఇ పుష్కలంగా ఉంటాయి. చర్మాన్ని సౌందర్యాన్ని పెంపొందించటంలో దీనికి మంచి గుర్తింపు ఉంది.

లావెండర్ ఆయిల్ ; లావెండర్ ఆయిల్ మొటిమలు, చర్మ సమస్యలను నియంత్రిస్తుంది. ఇది చర్మ అలెర్జీని నియంత్రిస్తుంది, చర్మపు చికాకులను తగ్గిస్తుంది. సహజమైన క్రిమినాశినిగా ఉపయోగపడుతుంది.చర్మాన్ని రక్షించడంలో లావెండర్ గొప్పగా సహాయపడుతుంది.

టీ ట్రీ ఆయిల్ ; టీ ట్రీ ఆయిల్ అనేది చలికాలంలో చర్మానికి మేలు కలిగించే నూనె. ఇది యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది. పొడి, దురద మరియు మంట వంటి సమస్యలతో పోరాడుతుంది. కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, బాదం నూనెతో కలిపి ఉపయోగించటం ద్వారా మంచి ప్రయోజనాలు పొందవచ్చు.

ఆర్గాన్ నూనెలు ; ఆర్గాన్ నూనెలో విటమిన్ ఇ, ఇతర కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. చర్మాన్ని హైడ్రేట్ ఉంచుతుంది. పోషణనిస్తుంది. ఎక్కువ సమయం చర్మాన్ని తేమగా ఉంచుతుంది. వాపును తగ్గిస్తుంది . మొటిమలను తగ్గించటంలో దీని యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉపకరిస్తాయి.

ఆలివ్ ఆయిల్ ; స్వచ్ఛమైన ఆలివ్ ఆయిల్ చర్మానికే కాకుండా శరీర ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది చర్మానికి పోషణనిచ్చి ముఖాన్ని మృదువుగా మారుస్తుంది. ఆలివ్ నూనెలో అనేక విటమిన్లు మరియు ఖనిజాలు ఉన్నాయి.