Monsoon Tips: వానాకాలంలో ఏం తినాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

వర్షాకాలం వచ్చిందంటే వేసవి వేడి నుంచి ఉక్కబోత నుంచి ఉపశమనం దొరికినట్లే. మనుషులు, మొక్కలు, జంతువులు, చిన్నపాటి జీవాలతో సహా ఊపిరిపోసుకుంటాయి. వాటితో పాటు వైరస్ కూడా పెరగడానికి హెల్ప్ అవుతుంది.

Monsoon Tips: వర్షాకాలం వచ్చిందంటే వేసవి వేడి నుంచి ఉక్కబోత నుంచి ఉపశమనం దొరికినట్లే. మనుషులు, మొక్కలు, జంతువులు, చిన్నపాటి జీవాలతో సహా ఊపిరిపోసుకుంటాయి. వాటితో పాటు వైరస్ కూడా పెరగడానికి హెల్ప్ అవుతుంది. మరి ఇలాంటి సమయంలో మీరు ఆహారం విషయంలో సరైన జాగ్రత్తలే తీసుకుంటున్నారా.. మీరు తింటున్న ఆహారం సరైనదేనా.. తెలుసుకోండిలా..

స్ట్రీట్ ఫుడ్ మానేయండి:
దాదాపు స్ట్రీట్ ఫుడ్ రెడీ చేసేవాళ్లు నీళ్ల పట్ల అందులో వాడే ముడిపదార్థాల మీద ఫోకస్ పెట్టరు. అలాంటి సమయంలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా అటాక్ చేసే అవకాశం ఉంది. ఓపెన్ ఎయిర్ లో ఉండే ఫుడ్ మీద గాలి ద్వారా వైరస్ ప్రభావం కనిపిస్తుంటుంది. అలా కాదని జాగ్రత్తలు పక్కకుపెట్టి జంక్ ఫుడ్ తింటున్నారంటే జబ్బులను ఆహ్వానిస్తున్నట్లే.

Street Food


బట్టలు ఇస్త్రీ చేసుకోవాలి:

ఇది వింటుంటే దానికి ఏం సంబంధం లేదు కదా అనిపిస్తుంది. క్లాతింగ్, బెడ్ షీట్లు, లినెన్ లాంటి దుస్తులు అన్నీ వార్డ్ రోబ్ లు, అల్మరాల్లో దాచి పెడుతూ ఉంటాం. వర్షాలు పడుతున్నంత సేపు ఆ ప్రదేశాలన్నీ చెమ్మగా మారి వాటిపై తేమను క్రియేట్ చేస్తాయి. అలా చేయడం ద్వారా దుస్తులపై తేమ క్రియేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అందుకే ఐరన్ చేసుకోవడం ద్వారా వాటిని అరికట్టవచ్చు.

Dress Iron

నీటిని నిల్వ చేసుకోవద్దు:
నీరు నిల్వ ఉంచుకోవడం వల్ల దోమలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాటి వల్ల వచ్చే సమస్యలే ఎక్కువ. దోమలు ఉండకుండా చేయాలంటే.. వాటర్ స్టోరేజ్ లేకుండా చేయాలి. ఒకవేళ నీరు నిల్వ చేయాల్సి వస్తే వాటిపై మూతలు ఉండేలా చూసుకోండి. అవసర్లేదనే పాత్రలు పొడిగా ఉంచుకోవడమే మంచిది.

Waste Water Storage

సరిపడ నిద్ర చాలా ముఖ్యం;
శరీరానికి అవసరమైన 7 నుంచి 8గంటల నిద్ర చాలా ముఖ్యం. అలా పడుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి ఫ్లూ, జ్వరాల నుంచి రక్షణ దొరుకుతుంది.

Efficient Sleep

పండ్లు, కూరగాయలు:

పండ్లు, కూరగాయల తోలుపై బ్యాక్టీరియా ఉంటుందనే విషయం మరచిపోవద్దు. నీటితో కడిగి ఉడకబెట్టిన తర్వాతే వండుకోవాలి. అలా చేయడంతో వాటిపై ఉండే ఇన్ఫెక్షన్లను అరికట్టవచ్చు.

Fresh Vegetables


గోళ్లు కత్తిరించుకోవడం

మీకు తరచుగా గోళ్లు కత్తిరించుకునే అలవాటు లేకపోయినా వర్షాకాలం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. రెగ్యూలర్ వాటిని చెక్ చేసుకుంటూ కడుగుకోవడం మర్చిపోకండి. క్రిములు, బ్యాక్టీరియా లేకుండా చేసుకోవడం కీలకం.

Nai;s Cutting

రెగ్యూలర్ ఎక్సర్‌సైజ్

ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల బరువు తగ్గడం ఫిట్‌నెస్ మెయిన్ టైన్ అవడమే కాదు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ బలపరిచి హార్ట్ బీటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. రక్త సరఫరా, సీరోటోనిన్ సింథసిస్ మెరుగవుతాయి. వైరస్, బ్యాక్టీరియాల నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు.

Regular Excercise

తడి చెప్పులు, బూట్లు

వర్షాకాలం ఎంత అందంగా ఉన్నా.. ఆరోగ్యానికి అంతే ముప్పు ఉందని మర్చిపోవద్దు. మీ చెప్పులు లేదా బూట్లు తడిగా ఉంటే వాటిని వెంటనే క్లీన్ చేసుకోవాలి. వేసుకునే ముందే అవి పొడిగా ఉండేలా చూసుకోవాలి.

Dry Shoes

విటమిన్ సీ వాడకం:

వైరస్.. బ్యాక్టీరియాల ప్రభావంతో వైరల్ జ్వరాలు, అలర్జిక్ బిహేవియర్ వంటివి వచ్చే అవకాశం ఉంది. గాల్లో ఉండే అతి చిన్న క్రిముల కారణంగానూ వైరస్ వ్యాప్తి ఉంటుంది. అలాంటి సమయంలో మీ ఇమ్యూనిటీని బూస్ట్ చేసే విటమిన్ సీ.. తప్పక వాడాలి. అంతేకాకుండా మొలకెత్తిన గింజలు, తాజా కూరగాయలు, ఆరెంజెస్ తప్పకుండా తినాలి.

Vitamin C Food

ట్రెండింగ్ వార్తలు