Lizard Problems: ఇంట్లో బల్లులా.. ఈ ఇంటి చిట్కాలు పాటించండి

మామూలు రోజుల్లో కంటే బల్లుల సమస్య వేసవికాలం తీవ్రంగా అనిపిస్తుంది. వేడి, ఉక్కబోత లాంటి వాతావరణాలు బల్ల్లుల సంతానోత్పత్తి అనుకూలంగా ఉండటమే ప్రధాన కారణం. ఇది బల్లులకే కాదు.

Lizard Problems

 

 

Lizards Problems: మామూలు రోజుల్లో కంటే బల్లుల సమస్య వేసవికాలం తీవ్రంగా అనిపిస్తుంది. వేడి, ఉక్కబోత లాంటి వాతావరణాలు బల్ల్లుల సంతానోత్పత్తి అనుకూలంగా ఉండటమే ప్రధాన కారణం. ఇది బల్లులకే కాదు.

సరీసృపాలన్నింటిలోనూ ఇదే సమస్య. కొన్ని సందర్భాల్లో మనమే వీటిని చూసి భయపడుతుంటాం. ఇంటిలో ఉండి మన చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పెట్టే వాటి నుంచి ఉపశమనం కోసం ఈ ఇంటి చిట్కాలు పాటించండి.

ఎండుమిరపకాయల కారం, నల్లటి మిరియాలు
కారంతో పాటు నల్ల మిరియాలు కలిపి ఇంట్లోని మూలల్లో స్ప్రే చేయండి. ఇంటిలో, కిటికీ మూలల్లో, డోర్ల దగ్గర దీనిని చల్లండి. వీటి వాసనే బల్లులను దూరంగా పోయేలా చేస్తుంది.

కోడి గుడ్డు పెంకు
కోడి గుడ్డు వాసన బల్లులకు నచ్చదని రీసెర్చ్ లలో తేలింది. అవి తిరిగే ప్రదేశాల్లో కోడిగుడ్లను ఉంచండి.

కాఫీ, పొగాకు
కాఫీ పౌడర్ ఉపయోగించి కూడా బల్లులను తరిమేయొచ్చు. పొగాకుతో కలిపిన ద్రావణాన్ని ఇంటి మూలల్లో చల్లి బల్లును తరిమికొట్టండి.

ఉల్లి – వెల్లుల్లి
వెల్లుల్లి రెబ్బలను, ఉల్లిపాయ ముక్కలను బల్లులు ఎక్కువగా తిరుగుతున్న ప్రదేశాల్లో ఉంచండి. లేదంటే ఈ రెండింటి మిశ్రమంతో పేస్టు చేసి అంటించినా పర్లేదు.

కర్పూర
ఇంటి మూలల్లో కర్పూరం ఉంచి బల్లులను తరిమేయొచ్చు.

నెమలీకలు
నెమలీకల వాసనకు బల్లులు పరుగులు తీస్తాయి. కాకపోతే ఇది ఎక్కువ కాలం పనిచేయదని చాలా మంది భావిస్తుంటారు.

నాప్తలీన్ బాల్స్
నాప్తలిన్ బాల్స్ ఇంటి మూలల్లో వేసి ఉంచండి. ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే 4-5 బాల్స్ వేయండి.

గుర్తుపెట్టుకోండి.. బల్లులు వేడిగా ఉన్న ప్రదేశాల్లోనే గుడ్లను పెడుతుంటాయి. మీరు చేసే ఈ టెక్నిక్స్ ఆ ప్రదేశాల్లో ఉపయోగిస్తే ఇంకా బెటర్ సొల్యూషన్ దొరకొచ్చు.