Pepper Help Cut Belly Fat : మిరయాలతో బొడ్డు చుట్టూ కొవ్వును తగ్గించడానికి అనుసరించాల్సిన మార్గాలు !

బరువు తగ్గించే ప్రయోజనాలను పొందాలంటే పెప్పర్ టీ ఒక అద్భుతమైన మార్గం. ఇందుకోసం నీటిని మరిగించి, ఒక టీస్పూన్ నల్ల మిరియాల పొడిని వేయాలి. దీన్ని కొన్ని నిమిషాలు అలాగే ఉంచి, వడకట్టుకుని గోరువెచ్చగా సేవించాలి. పెప్పర్ టీ నుండి వచ్చే వేడి శరీరం యొక్క థర్మోజెనిసిస్‌ను పెంచుతుంది.

black pepper

Pepper Help Cut Belly Fat : పెప్పర్, ప్రపంచవ్యాప్తంగా వంటకాలలో సంప్రదాయంగా విస్తృతంగా ఉపయోగించే మసాలా. వంటకాలకు రుచిని ఇవ్వటంతోపాటు బరువు తగ్గించే ప్రయోజనాలను కూడా అందిస్తుంది. రోజువారీ దినచర్యలో మిరయాలను వంటకాలలో మసాలా ఉపయోగించటం వల్ల బరువు తగ్గాలనుకునే వారు సులభంగా తమ లక్ష్యాలను చేరుకోవచ్చు. బరువు తగ్గడానికి మిరియాలు ఉపయోగించేందుకు వివిధ మార్గాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

READ ALSO : Low Fat vs Low Carb : తక్కువ కొవ్వు vs తక్కువ కార్బ్.. ఈ రెండింటిలో ఏది ఆరోగ్యకరమైనది?

బరువు తగ్గడానికి మిరియాలు ఎలా ఉపయోగించాలి?

1. తినే ఆహారంలో మిరియాలును పొడిరూపంలో వాడుకోవటం ;

ఆహారంలో మిరియాల పొడి తీసుకోవటం వల్ల బరువు పెరగకుండా చూసుకోవటమే కాకుండా, ఉన్న బరువును తగ్గవచ్చు. సలాడ్‌లు, సూప్‌లు, స్టైర్-ఫ్రైస్ వంటి ఇష్టమైన వంటకాలపై గ్రౌండ్ బ్లాక్ పెప్పర్, మిరియాల పొడి చల్లుకోవాలి. నల్ల మిరియాలలో కనిపించే కీలకమైన పదార్ధం పైపెరిన్. ఇది జీవక్రియతోపాటుగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గేలా చేయటంలో సహాయపడుతుంది. అవోకాడో టోస్ట్‌పై చిటికెడు మిరియాలపొడి చల్లుకుని తీసుకోవటం ద్వారా జీవక్రియలు మెరుగవుతాయి.

READ ALSO : Weight Loss And Fat Loss : బరువు తగ్గడం, కొవ్వు తగ్గడం మధ్య వ్యత్యాసం తెలుసా? ఆరోగ్యకరమైన శరీరం కోసం ఏంచేయాలంటే?

2. పెప్పర్ టీ తాగండి ;

బరువు తగ్గించే ప్రయోజనాలను పొందాలంటే పెప్పర్ టీ ఒక అద్భుతమైన మార్గం. ఇందుకోసం నీటిని మరిగించి, ఒక టీస్పూన్ నల్ల మిరియాల పొడిని వేయాలి. దీన్ని కొన్ని నిమిషాలు అలాగే ఉంచి, వడకట్టుకుని గోరువెచ్చగా సేవించాలి. పెప్పర్ టీ నుండి వచ్చే వేడి శరీరం యొక్క థర్మోజెనిసిస్‌ను పెంచుతుంది. క్యాలరీలను బర్న్ చేయటంతోపాటు, కొవ్వును కరిగించేందుకు దోహదం చేస్తుంది. జీర్ణక్రియకు ,జీవక్రియను పెంచడానికి భోజనం తర్వాత ఒక కప్పు పెప్పర్ టీని తీసుకోవటం మంచిది.

READ ALSO : Eating Ghee : నెయ్యి తింటే కొవ్వు పెరుగుతుందా? నిపుణులు ఏమంటున్నారంటే…

3. పెప్పర్ డిటాక్స్ డ్రింక్ ;

పెప్పర్ డిటాక్స్ డ్రింక్ బరువు తగ్గించటంలో సమర్థవంతంగా తోడ్పడుతుంది. నిమ్మరసం, ఆపిల్ సైడర్ వెనిగర్, నీటిలో ఒక టీస్పూన్ నల్ల మిరియాల పొడికలపాలి. ఈ సమ్మేళనం డైజేషన్సి స్టమ్‌ను శుభ్రపరచడంలో సహాయపడటమే కాకుండా జీవక్రియను పెంచుతుంది. బొడ్డు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదయాన్నే ఒక గ్లాసు పెప్పర్ డిటాక్స్ డ్రింక్‌తో రోజును ప్రారంభించటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బరువు తగ్గటంతోపాటు, బొడ్డు చుట్టూ ఉన్న కొవ్వును లక్ష్యంగా చేసుకోవడంలో బాగా ఉపకరిస్తుంది.

ఈ మార్గాలను అనుసరించటం ద్వారా మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవటంతో పాటు సన్నగా , నాజూగ్గా మారేందుకు అవకాశం ఉంటుంది.