Weight Loss And Fat Loss : బరువు తగ్గడం, కొవ్వు తగ్గడం మధ్య వ్యత్యాసం తెలుసా? ఆరోగ్యకరమైన శరీరం కోసం ఏంచేయాలంటే?

కొవ్వు తగ్గటం అన్నది కొవ్వు కణజాలం, శరీర కొవ్వు తగ్గింపును లక్ష్యంగా చేసుకుంటుంది. ఇది మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు మరియు ఇతర దీర్ఘకాలిక పరిస్థితులు వంటి ఆరోగ్య ప్రమాదాలతో ముడిపడి ఉన్న బరువు రకం.

Weight Loss And Fat Loss : బరువు తగ్గడం, కొవ్వు తగ్గడం మధ్య వ్యత్యాసం తెలుసా? ఆరోగ్యకరమైన శరీరం కోసం ఏంచేయాలంటే?

Weight Loss And Fat Loss

Weight Loss And Fat Loss : బరువు తగ్గడం, కొవ్వు తగ్గడం తరచుగా వీటిని మనం వింటుంటాం. అయితే ఆరెండు విభిన్నమైనవన్న విషయం చాలా మందికి తెలియదు. రెండింటి మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవటం వల్ల వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించుకోవచ్చు. ఆరోగ్యం , ఫిట్‌నెస్ కు సంబంధించిన ప్రణాళికలను రూపొందించుకోవచ్చు.

READ ALSO : Curry Juice : రక్తపోటును తగ్గించటంతోపాటు, పొట్ట కొవ్వులను కరిగించే కరివేపాకు జ్యూస్ !

బరువు తగ్గడం అనేది మొత్తం శరీర బరువులో తగ్గుదలని సూచిస్తుంది. ఇది కొవ్వు మాత్రమే కాకుండా కండరాలు, నీరు, ఇతర అంశాలు బరువు తగ్గటంలో మిళితమై ఉంటాయి. దీనిని సాధారణంగా స్కేల్‌పై కొలుస్తారు. ఆహారం తీసుకోవడం, ద్రవ స్థాయిలు, వ్యాయామ దినచర్యలో మార్పులు వంటి కారణాల వల్ల బరువు హెచ్చుతగ్గులకు లోనవుతుంది. వ్యాయామం, ఆహార నియంత్రణ, ఇతర పద్ధతుల ద్వారా కూడా బరువు తగ్గవచ్చు.

మరోవైపు, కొవ్వు తగ్గటం అన్నది కొవ్వు కణజాలం, శరీర కొవ్వు తగ్గింపును లక్ష్యంగా చేసుకుంటుంది. ఇది మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు మరియు ఇతర దీర్ఘకాలిక పరిస్థితులు వంటి ఆరోగ్య ప్రమాదాలతో ముడిపడి ఉన్న బరువు రకం. కొవ్వు తగ్గటం అన్నది సాధారణంగా ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం వల్ల సాధ్యమౌతుంది. కండర ద్రవ్యరాశిని నిర్మించడానికి, నిర్వహించడానికి దోహదపడుతుంది.

READ ALSO : Exercise : వ్యాయామం అనంతరం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే?…

బరువు తగ్గడం కంటే కొవ్వు తగ్గడంపై దృష్టి పెట్టడం వల్ల ఆరోగ్యం, శ్రేయస్సుకు అనేక ప్రయోజనాలు చేకూరతాయి. దీర్ఘకాలంలో కొవ్వు తగ్గడం వల్ల ప్రయోజనం చేకూరటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

మెరుగైన శరీర కూర్పు : కండరాలను సంరక్షించేటప్పుడు, నిర్మించేటప్పుడు కొవ్వును కోల్పోవడం ఆరోగ్యకరమైన శరీర కూర్పుకు దారితీస్తుంది. ఇది మొత్తం జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది, బలం, ఓర్పును పెంచుతుంది. శారీరక పనితీరును మెరుగుపరుస్తుంది.

మెరుగైన ఆరోగ్య ఫలితాలు : అదనపు శరీర కొవ్వును తగ్గించడం అన్నది మొత్తం ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని క్యాన్సర్ల వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

READ ALSO : Lose Weight Easily : బరువు సులభంగా తగ్గాలంటే ఈ సహజమైన చిట్కాలు పాటిస్తే సరిపోతుంది!

స్థిరమైన ఫలితాలు : రోజులకొద్దీ ఉపవాసాలు, క్రాష్ డైట్ లు వంటి విపరీతమైన చర్యల వల్ల వేగంగా బరువు తగ్గడం అన్నది నిలకడగా ఉండదు. కొద్దిరోజుల తరువాత తిరిగి బరువు పెరగడానికి దారితీస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి జీవనశైలిలో క్రమంగా, స్థిరమైన మార్పుల ద్వారా కొవ్వు తగ్గడంపై దృష్టి కేంద్రీకరించడం దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తుంది.

సానుకూల శరీర రూపం : కండర ద్రవ్యరాశిని తగ్గించే వ్యాయామాలు చేయటం వల్ల కొవ్వును కోల్పోయి శరీరం ఫిట్ గా ఉండే రూపాన్ని పొందుతుంది. తద్వారా ఆత్మగౌరవం, శరీర విశ్వాసం పెంచుతుంది.

READ ALSO : Stroke Risk : పక్షవాతం ముప్పుకు అధిక బరువు, రక్తపోటు అతిపెద్ద కారణాలా ?

బరువు తగ్గడం , కొవ్వు తగ్గడం మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం అన్నది ఆరోగ్యం, ఫిట్‌నెస్ లక్ష్యాల పై ప్లాన్ చేస్తున్నవారికి ఎంతో మేలు చేస్తుంది. వ్యక్తిగత అవసరాలు, లక్ష్యాలకు సరిపోయే వ్యక్తిగత ప్రణాళికను రూపొందించుకోవాలంటే ఆరోగ్య నిపుణుడిని, అర్హత కలిగిన ఫిట్‌నెస్ నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.