Curry Juice : రక్తపోటును తగ్గించటంతోపాటు, పొట్ట కొవ్వులను కరిగించే కరివేపాకు జ్యూస్ !

కరివేపాకు జ్యూస్ తాగడం చేస్తే అజీర్తి సమస్య దూరం చేస్తుంది. సమయానికి ఆకలి వేస్తుంది. వేళకు ఆహారం తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు. కొవ్వు కరిగించడంలో కరివేపాకు కీలకపాత్ర పోషిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు కరివేపాకు జ్యూస్ సేవించటం వల్ల ప్రయోజనం ఉంటుంది.

Curry Juice : రక్తపోటును తగ్గించటంతోపాటు, పొట్ట కొవ్వులను కరిగించే కరివేపాకు జ్యూస్ !

curry leaves

Curry Juice : పూర్వకాలం నుండే కరివేపాకును వంటల్లో విరివిగా వాడేవారు. దీనికి ముఖ్య కారణం దీనిలో అనేక ఔషదగుణాలు ఉండటమే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా మంది అధిక బరువు తో బాధపడుతున్నారు. బరువు తగ్గడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బరువు తగ్గడం ఓ సమస్యగానే ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇదే సమస్య చాలా మందిని వెంటాడుతుంది. దీని ఫలితంగా చాలా మందికి కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే కరిపేపాకు మీకు చక్కగా ఉపయోగపడుతుంది. అదెలాగో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

కరివేపాకు మంచి సువాసన కలిగినటువంటి పదార్థం. వంటల్లో తప్పకుండా కరివేపాకును విరివిగా ఉపయోగిస్తారు. వంటల రుచిని పెంచడానికి కరివేపాకు బాగా ఉపయోగపడుతుంది. కరివేపాకుతో శరీరంలోని అనేక రుగ్మతలు దూరమవుతాయి. ఇందులో స్థూలకాయం ప్రధానమైంది. పొట్ట,నడుము భాగాల చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించాలంటే, కరివేపాకు జ్యూస్ తీసుకోవడంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కరివేపాకు రోజువారిగా తింటే బాడీ డిటాక్స్ అవుతుంది.

READ ALSO : Boost Your Immunity : ఉదయం నిద్రలేచిన వెంటనే వీటిని తీసుకుంటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది తెలుసా?

కరివేపాకు జ్యూస్ తాగడం చేస్తే అజీర్తి సమస్య దూరం చేస్తుంది. సమయానికి ఆకలి వేస్తుంది. వేళకు ఆహారం తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు. కొవ్వు కరిగించడంలో కరివేపాకు కీలకపాత్ర పోషిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు కరివేపాకు జ్యూస్ సేవించటం వల్ల ప్రయోజనం ఉంటుంది. దీనివల్ల పోషకాలు, విటమిన్లు సులువుగా రక్తంలోకి చేరతాయి.

ఇందులో ఉండే ఆల్కలాయిడ్ల సహాయంతో లిపిడ్, ఫ్యాట్ కరిగించవచ్చు. కరివేపాకు జ్యూస్ తాగడం వల్ల ట్రై గ్లిసరాయిడ్స్ తగ్గించవచ్చు. దీంతో పాటు బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. ఉదయం పరగడుపున నాలుగు లేదా కరివేపాకులను పచ్చివి మంచిగా కడిగి నమిలినా మంచిదేనని నిపుణులు చెప్తున్నారు. అలా చేయడం వలన బీపీ కంట్రోల్‌లోకి వస్తుంది. శరీరంలో పేరుకుపోయిన అధిక కొలెస్ట్రాల్‌ ను బయటకు పంపేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిల్ని కంట్రోల్ చేస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల్ని నివారించుకోవచ్చు..

READ ALSO : Sunni Pindi : చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చే సున్నిపిండి ! తయారీ ఎలాగంటే ?

కరివేపాకు జ్యూస్ తయారీ ;

జ్యూస్ తయారు చేసేందుకు తొలుత కరివేపాకులను కడిగి నీటిలో వేసి బాగా మరిగించాలి. కొద్ది సేపటి తరువాత ఈ నీటిని వడగట్టి గోరువెచ్చగా తాగాలి. రుచికోసం అవసరమైతే.. నిమ్మరసం, కొద్దిగా తేనె కలుపుకోవాలి. కరివేపాకు జ్యూస్ ని కేవలం పరగడుపున మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.