Bottle Gourd
Bottle Gourd : ప్రకృతి ప్రసాదించిన అనేక కూరగాయాల్లో మనకు అందుబాటులో ఉన్న కూరగాయ సొరకాయ. వీటిని ఆనపకాయలు అని కూడా పిలుస్తారు. సంప్రదాయబద్ధమైన వైద్య చికిత్సలో సొరకాయను ఎక్కువగా వాడతారు. వీటిని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ సొరకాయల వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. సొరకాయ చేసే మేలు అంతాఇంతాకాదు. దాని వల్ల ఆరోగ్యానికి వచ్చే లాభాలు అన్నీ ఇన్నీ కావు. చక్కటి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి సొరకాయ చాలా బాగా సహకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
కాల్షియం, పాస్పరస్, విటమిన్ – సి, బి.కాంప్లెక్క్ష్ , సొరకాయలో లబిస్తాయి . సొరకాయలో పీచు పదార్ధం ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. సొరకాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది , సులువుగా జీర్ణమవుతుంది. మలబద్దకం సమస్య ఉన్నవారికి సొరకాయలు అద్భుతంగా పనిచేస్తాయి. దీని జ్యూస్‌ను రోజూ ఉదయం పరగడుపునే 30 ఎంఎల్ మోతాదులో తాగితే మంచి ఫలితం ఉంటుంది. సొరకాయల్లో ఉండే పీచు పదార్థం మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. జీర్ణ సమస్యల నుంచి బయట పడేస్తుంది. ఆయుర్వేద ప్రకారం సొరకాయలను పెరుగుతో తీసుకుంటే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది.
ముత్రనాళాల జబ్బులకు ఇది మంచిది. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్ సమస్యలతో బాధపడుతున్నవారు రోజూ సొరకాయలను తింటున్నా లేదా వాటి జ్యూస్‌ను తాగినా ఫలితం ఉంటుంది. ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. పచ్చిసొరకాయ రసం దాహార్తిని అరికడుతుంది , అలసటను తగ్గిస్తుంది. సొరకాయలో పీచు పదార్ధం ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇనుము, సోడియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా సొరకాయ తినడం వల్ల శరీరానికి సమకూరుతాయి. అధిక బరువును తగ్గించుకోవడం అన్నది ప్రస్తుత తరుణంలో చాలా మందికి ఇబ్బందిగా మారింది. అయితే సొరకాయ జ్యూస్‌ను రోజూ ఉదయం పరగడుపున ఒక గ్లాస్ మోతాదులో తాగుతుంటే అధిక బరువు తగ్గుతారు. శరీరంలో ఉండు కొవ్వు కరిగిపోతుంది.
తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తినేవారికి సొరకాయ చక్కటి అదనపు ఆహారంగా పనికివస్తుంది.బీపీని నియంత్రించడంలోనూ సొరకాయలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటి జ్యూస్‌ను రోజూ తాగుతుంటే హైబీపీ తగ్గుతుంది. సొరకాయల్లో సోడియం, పొటాషియం, ఇతర ముఖ్యమైన మినరల్స్ ఉంటాయ. అందువల్ల బీపీ నియంత్రణలోకి వస్తుంది. సొరకాయలో 92శాతం నీరు ఉండటం వల్ల, తిన్న ఆహానం మరింత శక్తివంతంగా తేలికగా జీర్ణం అవ్వడానికి బాగా సహాయపడుతుంది.
సొరకాయలో పీచు పదార్ధం ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. బి.పి., మదుమేహ వ్యాధిగ్రస్తురకు సొరకాయ మంచి ఆహారం. మధుమేహం సమస్య ఉన్నవారు రోజూ సొరకాయ జ్యూస్‌ను తాగుతుంటే షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయవచ్చు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. మధుమేహం నియంత్రణలోకి వస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి సొరకాయలు ఎంతగానో మేలు చేస్తాయి. సొరకాయను తిని, శరీరంలోని ఇన్సులిన్ లెవల్స్ ను సమతుల్యంగా ఉంచుకోండి.
లివర్ ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవాలంటే సొరకాయను ఆహార రూపంలో తీసుకోవాలి. ఈ గ్రీన్ వెజిటేబుల్ కాలేయంలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. అన్ని రకాల కాలేయ సమస్యలను నివారిస్తుంది. లివర్ సమస్యలు ఉన్నవారు రోజూ సొరకాయ జ్యూస్‌ను తాగితే మంచిది. లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. లివర్‌లోని వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు పోయి లివర్ శుభ్రంగా మారుతుంది. బరువు తగ్గాలనుకున్నవారికి సొరకాయ ఎంతగానో సహాయపడుతుంది. సొరకాయ, శరీరంలోని క్యాలరీలను అతి సులభంగా తగ్గిస్తుంది. ఈ గ్రీన్ వెజిటేబుల్ శరీరంలోని కొవ్వు కణాలను విచ్చిన్నం చేస్తుంది.
సొరకాయల్లో కోలిన్ అనే న్యూరోట్రాన్స్‌మిటర్ ఉంటుంది. ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మానసిక సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. సొరకాయ జ్యూస్‌ను రోజూ తాగుతుంటే మానసిక సమస్యలు పోతాయి. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. నిద్ర చక్కగా పడుతుంది. ఆస్తమా, కామెర్లు వంటి సమస్యలు ఉన్నవారు రోజూ సొరకాయ జ్యూస్‌ను తాగితే ప్రయోజనం ఉంటుంది.