Mirror Color: అద్దం రంగు చెప్పగలరా..

అద్దం రంగు అడిగితే ఎవరైనా ఏం చెప్తాం. అందులో కనిపించేది మన ప్రతిబింబమే కదా. దాని ఎదురుగా ఏది ఉంటే అది కనిపిస్తుందంతే అనుకుంటాం కదా. కాదు.. అద్దానికి రంగుంది.

Mirror Co0lor

Mirror Color: అద్దం రంగు అడిగితే ఎవరైనా ఏం చెప్తాం. అందులో కనిపించేది మన ప్రతిబింబమే కదా. దాని ఎదురుగా ఏది ఉంటే అది కనిపిస్తుందంతే అనుకుంటాం కదా. కాదు.. అద్దానికి రంగుంది. చాలా తక్కువ మంది మాత్రమే తెలిసిన సమాధానం ఏమనుకుంటున్నారు. ఒకవేళ మీరు ఊహించడానికి ప్రయత్నిస్తే సిల్వర్ లేదా.. రంగు ఏం ఉండదు అని అనుకోవచ్చు.

కానీ, అది తప్పు. అద్దం నిజమైన రంగు తెలుపుతో కూడిన ముదురు ఆకుపచ్చ. ఇప్పుడే మీకో డౌట్ రావొచ్చు. ‘వైట్ తో కూడిన గ్రీన్ టీ షర్ట్ ఉంటుంది కదా.. అందులో మనం ముఖం చూసుకోవచ్చా.. అని ‘ అది ఒక సిల్లీ డౌట్ మాత్రమే. టెక్నికల్ గా ఆప్టికల్ ఫిజిక్స్ ఆధారంగా చెప్పిందే ఈ కలర్.

నిజానికి కలర్ అనేది కాంతి నుంచి పుట్టేదే. కాంతి వస్తువుపై పడి తిరిగి మన రెటీనాకు చేరుతుంది. బ్రెయిన్ కు చేరిన ఆ ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ రూపంలో మన కళ్లకు స్పష్టం చేస్తుంది. అలా వస్తువుపై కాంతి పడటం అది పునరావర్తనం చెందే దూరం ఉంటేనే రంగు మన కంటికి కనిపించగలదు.

ఇక అద్దంలో అలాంటి వస్తువుల రంగు చూడాలంటే.. వస్తువుపై బడ్డ కాంతి పూర్తి స్థాయిలో పునరావర్తనం చెందితేనే సాధ్యపడుతుంది. అన్నీ ఒకేలా జరగవు. కొన్ని సార్లు విద్యుదయస్కాంత రేడియషన్ రూపంలోనూ జరగొచ్చు.