Gold Purity
Gold Purity: గోల్డ్ ప్యూరిటీకి కొలమానం క్యారట్స్.. 24 అంటే అందులో స్వచ్ఛత ఎక్కువగా ఉన్నట్టు అన్నమాట. ఇలా గోల్డ్ లో 24, 22, 18 క్యారట్స్ కింద చెప్తుంటారు. అసలు ఏ క్వాలిటీ అంటే ఏముంటుందో ఓసారి తెలుసుకుందాం.
24 క్యారట్స్ గోల్డ్..
24 క్యారట్స్ గోల్డ్ అంటే 99.9% స్వచ్ఛత ఉంటుంది. ఇతర లోహాలు కలిస్తేనే.. ప్యూరిటీ మిస్ అవుతుందన్నమాట. భారత్‌లో 24కే బంగారం ధర రోజురోజుకూ మారుతూ ఉంటుంది. 22 కే, 18కే గోల్డ్ కంటే అత్యంత విలువైందీ 24 కే బంగారం. ఫైనాన్సియల్ అవసరాలకు మాత్రమే సెట్ అవుతుంది కానీ, ఆభరణాల తయారీకి వాడరు.
మిశ్రమాలతో 22 క్యారట్స్
బంగారంలో 22 క్యారట్ల స్వచ్చత ఉంటుంది. జింక్, రాగి తదితర లోహాలు మిక్స్ చేస్తారు. 91.67 శాతం ప్యూరిటీతో ఉంటూ జ్యువెల్లరీ తయారీకి ఇది సూటబుల్. అందుకే దీన్ని 916 గోల్డ్ అని అంతా పిలుస్తుంటారు.
మదుపుకు 24 క్యారట్స్ కరెక్ట్ ఛాయీస్
ఇన్వెస్ట్‌మెంట్ కోసమే అయితే 24 క్యారట్ల బంగారం ఐడియల్ ఛాయిస్. 24కే గోల్డ్ కాయిన్ లేదా బార్ కొనుగోలు చేయడం బెటర్ అనే అభిప్రాయం ఉంది. ఇన్వెస్ట్‌మెంట్ అవసరాల కోసం కాకుంటే 24 క్యారట్ల బంగారం కొనుగోలు చేయడం కరెక్ట్ కాదని నిపుణులు అంటున్నారు.
మీరు 14 కే గోల్డ్ రింగ్ కొన్నారనుకోండి. దాన్ని 24తో బాగిస్తే 0.583కి సమానం అవుతుంది. అంటే 14కే గోల్డ్ రింగ్‌లో బంగారం కంటెంట్ 58.3 శాతం ఉంటుందన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే బంగారంలోని క్యారట్లను బట్టి దాని స్వచ్ఛతకు గ్యారంటీ లభిస్తుంది.