మిలియన్ ఏళ్లనాటి బొర్రా గుహల ప్రత్యేకత తెలుసుకోవాల్సిందే!

  • Publish Date - February 28, 2020 / 07:28 AM IST

ఈ గుహలు కొన్ని మిలియన్ ఏళ్ల కిందట ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవి. నీటిప్రవాహం వల్ల కరిగిన రాళ్లు ఇక్కడ శిలలుగా ఏర్పడి ఎంతో అందంగా కనిపిస్తాయి. ఇవి విశాఖపట్నానికి 125.6 కిమీల దూరంలో అనంతగిరిలో ఉన్నాయి. భారతదేశంలో అత్యంత పొడవైన, లోతైన గుహలు ఇవే. ఓసారి బొర్రా గుహలో జరిపిన తవ్వకాల్లో 30 వేల నుంచి 50 వేల సంవత్సరాల నాటి రాతి పనిముట్లు లభించాయి. వీటి ఆధారంగా ఈ గుహల్లో మానవులు జీవించేవారని తెలిసింది. 1990లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పర్యాటక శాఖ ఈ గుహలను స్వాధీనం చేసుకుని.. గుహ లోపల రంగు రంగుల విద్యుత్తు దీపాలను అలంకరించి పార్కులు అభివృద్ధి చేశారు. 

ఈ గుహలలో దాగి ఉన్న శివలింగం ఎలా దొరికిందంటే? 
1807 లో.. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన విలియం కింగ్ జార్జ్ ఈ గుహలను కనుగొన్నారు. ఈ గుహలో ఉన్న శివలింగం సహజ సిద్ధంగా ఏర్పడిందని స్థానికులు చెబుతారు.

ఇందులోకి ఎలా వెళ్ళాలి?
బొర్రా గుహలకు వెళ్లేందుకు విశాఖపట్నం నుండి రైలు, బస్సు సదుపాయాలున్నాయి. అరకులోయ కంటే ముందుగానే ఈ గుహలు వస్తాయి. హైదరాబాద్‌ నుంచి 656 కిలోమీటర్ల దూరం. అక్కడికి వచ్చే పర్యటకుల కోసం సమీపంలో హోటళ్ళు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎంట్రీ ఫీజు.. పెద్దలకు అయితే రూ.40, చిన్నపిల్లలకు రూ.30 ఉంటుంది. సమయం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ఉంటుంది.

See Also |  భూమికి రెండో చంద్రుడొచ్చాడు… మారుతీ కారు సైజులో ఉన్నాడు… కలర్‌లో చూడండి.